Jagan Mohan Reddy Dictatorial Tendencies in YSR Congress Party

ఏ స్థాయి వ్యక్తయినా ఒక్కసారి జైలుకు వెళితే ఇక అక్కడ ఉన్న అధికారుల ఆదేశాలను తూచాతప్పకుండా అనుసరించాల్సిందే. వారి వారి వ్యక్తిగత ఇష్టాయిష్టాలకు, సొంత అభిప్రాయాలకు, స్వీయ నిర్ణయాలకు తావుండదు.

అలాగే ఎంతటి సీనియర్ రాజకీయ నాయకుడైన, ఎంతటి చదువులు చదువుకున్న రాజకీయ నేతలైన ఒక్కసారి వైసీపీ కండువా భుజాన వేసుకుంటే ఇక అతను తన వ్యక్తిగత స్వేచ్ఛ ను కోల్పోయినట్టే. అలాగే తన ఇష్టానుసారం రాజకీయాలు చేయలేరు, తనకు నచ్చిన విధంగా తన సొంత నిర్ణయాలను అమలు చెయ్యలేరు, తన ఆలోచనలకు తగ్గట్టుగా అభిప్రాయాలను బహిర్గతం చెయ్యలేరు.

Also Read – ఈ పైరసీల ఫాంటసీ ఏంటో..? దీనికి వాక్సిన్ లేదా.?

సర్వం జగన్ మయం అనేలా ఆ జగన్నాటకంలో భాగమవ్వాల్సిందే తప్ప సొంతగా ఎదగడానికి ఆస్కారం ఉండదు. రాజకీయంగా ఎంతో అనుభవం ఉన్న తన సొంత చిన్నాయన వేవిక విషయంలో కూడా జగన్ ఇదే పంథాను అనుసరించారు. అలాగే తన తోడబుట్టిన సొంత చెల్లి షర్మిల విషయంలోనూ అభద్రతా భావానికి లోనై షర్మిల రాజకీయ ఉనికిని కనుమరుగు చేసే ప్రయత్నం చేసారు.

వైసీపీ పార్టీ తరుపున ఏ వ్యక్తి ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా అది కేవలం జగన్ బొమ్మ చూసి పడిన ఓట్లుగానే పరిగణించబడాలి, అలాగే ఇక ఆ ఐదేళ్ల ఎమ్మెల్యే పదవి, ఎంపీ బాధ్యత రెండు కూడా జగన్ కనుసన్నలలోనే నడుచుకోవాలి. ఇదంతా కూడా ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన నాయకులు బహిర్గతం చేస్తున్న వాస్తవాలే.

Also Read – ప్రభుత్వంపై ఆధారపడమంటారు జగన్‌.. వద్దంటారు చంద్రబాబు!

తాము ఎవరిని ఎలా తిట్టాలో కూడా పార్టీ అధిష్టానం నుండి పార్టీ పెద్దల నుండి స్క్రిప్ట్ వస్తుందని, దాని ప్రకారమే ఆ ఆదేశాలను పాటించడం తప్ప తమ చేతిలో మరో ఆప్షన్ అంటూ ఏమి ఉండదంటూ ఆ పార్టీ మాజీ నేతలే సెలవిస్తున్నారు. గత ఐదేళ్లు వైసీపీ జెండా పట్టుకుని జగన్ భజన చేసిన ఎంతో మంది సీనియర్ నాయకులు ఇప్పుడు పార్టీ ని వీడుతూ
అందరూ జగన్ నియంతృత్వాన్ని, నియంత ధోరణిని ఎండగడుతున్నారు.

దీనితో వైసీపీ అనేది ఒక జైలు పార్టీ మాదిరి అనే భావన ఏర్పడుతుంది. ఇక్కడ కేవలం ఆదేశాలే తప్ప ఆలోచనలకు, ఆశలకు తావులేదనేది సుస్పష్టమయ్యింది. ఇక వైసీపీ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి మొదలుకుని ఆ పార్టీ ముఖ్యనేతలందరు కూడా బెయిలు మీద బయట తిరుగడమో లేక ముందస్తు బెయిలు కోసం కోర్టుల చుట్టూ తిరగడమో చేస్తున్నారు.

Also Read – ఢిల్లీ బీజేపి ఊడ్చేస్తే తెలంగాణలో కళ్ళాపి తప్పదేమో?

రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో గత ఐదేళ్ల వైసీపీ అరాచకాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. అందులో సజ్జల, పెద్ది రెడ్డి మొదలుకుని పేర్నినాని, దేవినేని అవినాష్, జోగి రమేష్ వంటి అనేకమంది ముందస్తు బెయిలు కోసం న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. ఇక వైసీపీ మాజీ ఎంపీ నందిగామ సురేష్, పిన్నెలి రామకృష్ణ వంటి నేతలు జైలు నుంచి బెయిలు మీద బయటకు వచ్చారు.




ఈ విధంగా వైసీపీ పార్టీ తన నియంతృత్వ ధోరణి తో ‘జైలు’ పార్టీ గా తమ అవినీతి తో ‘బెయిలు’ రాజకీయాలు చేస్తూ ఏపీ భవిష్యత్ ని అంధకారంలోకి నెట్టే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే ఈ వైసీపీ అనే జైలు నుండి అనేక మంది రాజీనామా అనే బైలుతో బయటకు వచ్చి మరోపార్టీలో చేరి రాజకీయాలు చేస్తున్నారు. అలాగే బెయిలు రాజకీయాలు చేస్తున్న జగన్ మరోమారు రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు.