
వైసీపీలో, ఆక్రమాస్తుల కేసులలో జగన్ తర్వాత ఎవరంటే విజయసాయి రెడ్డి అని టక్కున చెప్తారు. జగన్‌కి తోడుగా చంచల్‌గూడా జైలుకి కూడా వెళ్ళివచ్చిన విజయసాయి రెడ్డి, జగన్ విదేశాలలో ఉన్నప్పుడు మాట మాత్రంగానైనా చెప్పకుండా పార్టీని, ఎంపీ పదవిని విడిచిపెట్టడం వైసీపీలో ప్రకంపనలు సృష్టించింది.
జగన్‌తో కలిసి అన్నేళ్ళు పనిచేసిన ఆయన, కనీసం జగన్ లండన్ నుంచి వచ్చిన తర్వాత అయినా వెళ్ళి కలవలేదు. కానీ జగన్ ద్వేషిస్తున్న వైఎస్ షర్మిలని కలిశారు. ఆమె ఇంట్లో భోజనం కూడా చేశారు.
Also Read – హస్తినలో అరకు కాఫీ ఘుమఘమలు
జగన్ లండన్ నుంచి తిరిగివచ్చిన వెంటనే విజయసాయి రెడ్డి గురించి మాట్లాడి ఉంటే, ఆయన వెళ్ళిపోవడం వలన పార్టీకి, తనకీ చాలా నష్టం జరిగిందనే భావన అందరికీ కల్పించిన్నట్లవుతుందని అనుకున్నారు. అందుకే ఆయన గురించి మాట్లాడకుండా రోజువారి పార్టీ కార్యక్రమాలతో బిజీబిజీగా గడుపుతున్నారు.
కానీ వైసీపీలో, ఆక్రమాస్తుల కేసుల్లో నంబర్: 2గా ఉన్న విజయసాయి రెడ్డి వెళ్ళిపోతే, మాట్లాడకుండా ఇంకా ఎంత కాలం నిగ్రహించుకోగలరు?అందుకే ఇవాళ్ళ జగన్ మాట్లాడేశారు.. అనే కంటే యుద్ధం ప్రకటించేశారని చెప్పొచ్చు.
Also Read – రుషికొండ ప్యాలస్‌కు 500 కోట్లు.. పక్కనే ఉన్న బీచ్‌కి జీరో!
ఇంతకీ జగన్ ఏమన్నారంటే, “మాకు 11 మంది రాజ్యసభ సభ్యులున్నారు. మొదట ముగ్గురు ఇప్పుడు సాయిరెడ్డితో కలిపి నలుగురు పోయారు. మాకేం పెద్ద తేడా రాదు. రాజకీయాలలో ఉన్నవారికి విలువలు, విశ్వసనీయత చాలా ముఖ్యం. పార్టీలో ఉన్నవారికైనా, బయటకు పోతున్నవారికైనా విశ్వసనీయత చాలా ముఖ్యం. ముఖ్యమంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే ఎవరైనా సరే ‘ఇతనే మా నాయకుడు’ అని గర్వంగా కాలరేగరేసుకొని చెప్పగలగాలి.
కానీ ప్రలోవభాలకు లొంగో లేదా దేనికో భయపడో లేదా వేరే కారణం చేతో మన వ్యక్తిత్వాన్ని మనమే దెబ్బ తీసుకోవడం సరికాదు. మన ప్రజాస్వామ్య వ్యవస్థలో కష్టాలు కలకాలం ఉండవు. కేవలం 5 ఏళ్ళే ఉంటాయి.
Also Read – సోము ‘శీల’ పరీక్ష కు సిద్దపడుతున్నారా.?
కష్టాలు ఎదురైనప్పుడు వాటిని ఓపికగా భరించే శక్తి ఉండాలి. కానీ ఈ మాత్రం కూడా ఓపికపట్టకుండా ‘అటువైపు’
పోతే మన విలువ, మన వ్యక్తిత్వం మనమే దెబ్బ తీసుకుంటే రాజకీయాలలో ఎలా రాణించగలరు?” అని జగన్ అన్నారు.
విజయసాయి రెడ్డి పార్టీకి, పదవికి రాజీనామా చేసిన తర్వాత తాను ముందుగానే జగన్‌కి ఫోన్ చేసి అన్నీ మాట్లాడి అనుమతి తీసుకున్నానని చెప్పారు. కానీ ఇప్పుడు జగన్ మాటలు వింటే ఆయనకు మాట మాత్రంగానైనా చెప్పలేదని స్పష్టమవుతోంది.
భయాలు, ప్రలోభాల కారణంగానే విజయసాయి బయటకు వెళ్ళిపోయారని జగన్ చెప్పేశారు. భయాలంటే కేసులతో భయాలు, ప్రలోభాలంటే కేసుల నుంచి ఉపశమనం అని వేరే చెప్పక్కరలేదు.
పోతే పోయారు మాకేం నష్టం లేదన్నారు. విజయసాయి రెడ్డి బయటకు పోయారు కనుక ఆయనకు క్యారక్టర్ లేదని జగన్ తేల్చి చెప్పేశారు… అంటే ఇక విజయసాయి రెడ్డిపై మూకుమ్మడి దాడి చేయవచ్చని వైసీపీ నేతలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన్నట్లే!
కానీ ఆక్రమస్థుల కేసులు, వివేకా హత్య కేసుల గురించి విజయసాయి రెడ్డి నోరు విప్పినా, అప్రూవరుగా మారినా జైలుకి వెళ్ళాల్సి రావచ్చు.. అని జగన్‌కి తెలియదనుకోలేము.
సొంత తల్లి, చెల్లిపైనే సొంత మీడియాలో, పార్టీ నేతలతో విమర్శలు చేయించిన జగన్, తనని ఈవిదంగా దెబ్బ కొట్టివెళ్ళిపోయిన విజయసాయి రెడ్డిని ఉపేక్షిస్తారనుకోలేము. కనుక జగన్ ఓ లైన్.. దానికి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశారు. కనుక వైసీపీ నేతలు, ముఖ్యంగా.. వైసీపీలో విజయసాయి రెడ్డి బాధితులు ఇక మొదలెట్టేయవచ్చు.
జగన్-వైఎస్ షర్మిల యుద్ధంతో ఏదో జరుగుతుందని అందరూ అనుకున్నారు. కానీ వైసీపీ ఓటమికి ఉడతాభక్తిగా ఆమె కృషి చేయడం తప్ప మరేమీ చేయలేకపోయారు. కానీ విజయసాయి రెడ్డితో యుద్ధం మొదలుపెడితే అది ఏవిదంగా సాగుతుందో? దానిలో ఎవరు బలవుతారో?రాబోయే రోజుల్లో చూడవచ్చు.