Jagan Mohan Reddy is Better Than KCR in Some Matters

పార్టీ ఓటమిని అంగీకరించలేక, ప్రత్యర్థి గెలుపుని స్వీకరించలేక రెండు తెలుగు రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రులు అసెంబ్లీ గడప తొక్కలేకపోతున్నారు. ఇందులో కేసీఆర్ ఫామ్ హౌస్ కి పరిమితమైతే, జగన్ ప్యాలస్ రాజకీయాల చుట్టూ తిరుగుతున్నారు.

పార్టీ అధికార పక్షంలో నుంచి విపక్షానికి వచ్చి దాదాపు ఏడాది కావస్తున్నా ఇంకా ఇద్దరు పార్టీల అథినేతలు ప్రజా తీర్పుని గౌరవించలేక సతమతమవుతున్నారు. అయితే అనర్హత వేటు భయంతో నేడు అసెంబ్లీ కి వచ్చి వెళ్లిన జగన్ మెరుపు తీగలా ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు.

Also Read – పవన్ జాతీయస్పూర్తి బాగుంది కానీ..

తమ పార్టీ నేతలతో ప్రతిపక్ష హోదా కోసం అసెంబ్లీలో నినాదాలు చేయించి అటు పిమ్మట అసెంబ్లీలో హాజరు నమోదు చేసుకుని ఇక అసెంబ్లీ నుంచి వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించి బయటకు వెళ్లిపోయారు. అలాగే మరో 60 రోజుల పాటు వైసీపీ నేతలకు ఈ హాజరు బెడద లేకపోవడంతో ఇక ఇప్పుడప్పుడే అసెంబ్లీకి వచ్చే ఉద్దేశం లేదంటూ కుండబద్దలు కొట్టేసి ఛలో బెంగళూర్ ఫ్లయిట్ ఎక్కనున్న జగన్.

ఇక తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే అసెంబ్లీకి కాదుకదా కనీసం పార్టీ నేతలకు కూడా అందుబాటులోకి రావడం లేదు. పార్టీ కార్యక్రమాల్ని కేటీఆర్, హరీష్ భుజాన వేసుకుని మోస్తుండడంతో ఇక కేసీఆర్ ఊసే లేకుండా పోతుంది. కాంగ్రెస్ పార్టీ నేతలు ఎంతలా రెచ్చకొట్టినా, ప్రభుత్వ పెద్దలు ఎంతలా కవ్వించినా కేసీఆర్ మాత్రం ప్రజా క్షేత్రంలోకి రావడం లేదు.

Also Read – ఊరిస్తూనే…ఉసురుమనిపిస్తుందే..!

ఈ సంక్రాంతికి వస్తాను, శివ రాత్రికి వస్తాను, ఉగాది కి వస్తాను అంటూ పండుగల పేర్లు చెప్పుకుంటూ తప్పించుకుంటున్నకేసీఆర్ ప్రతిపక్ష హోదా ఉన్నప్పటికీ అసెంబ్లీకి డుమ్మా కొడుతున్నారు. అలాగే పార్టీ కార్యక్రమాలకు గైర్హాజరవుతున్నారు. జగన్ తన పార్టీ నేతలను పరామర్శించడానికో, లేక ఎవరైనా చనిపోతే శవ రాజకీయాలు చేయడానికో మీడియా ముందుకొచ్చి హడావుడి చేసి పార్టీ క్యాడర్ లో బలాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు.

కానీ కేసీఆర్ మాత్రం తన సొంత కుమార్తె లిక్కర్ కేసులో అరెస్టై సుమారు 6 నెలలు తీహార్ జైల్లో ఉన్నప్పటికీ కనీసం ఆ అరెస్టు ఖండించడానికి కూడా మీడియా ముందుకు రాలేకపోయారు. ఇక కొడుకు కేటీఆర్ ఈ ఫార్ములా రేస్, ఫోన్ టాపింగ్ కేసులో అరెస్టు కాబోతున్నారంటూ మీడియాలో పెద్దఎత్తున ప్రచారం జరిగినప్పటికీ స్పందించలేదు.

Also Read – ఏపీకి పెట్టుబడుల ప్రవాహం… చాలా అవసరమే!


జగన్ మాత్రం తమ పార్టీ నేతలను కూటమి ప్రభుత్వం అన్యాయంగా అరెస్టు చేస్తుందని, అలాగే తమ పార్టీలోని అందగాళ్ళ పట్ల కూటమి ప్రభుత్వం కక్ష రాజకీయాలకు పాల్పడుతుందంటూ పార్టీ శ్రేణుల కోసం జగన్ అడపాదడపా తన గళం వినిపిస్తున్నారు. అలాగే ఏపీ ప్రభుత్వం పై రాజకీయ విమర్శలకు ఎగబడుతున్నారు. దీనితో ఈ విషయంలో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కేసీఆర్ కంటే జగన్ చాల బెటర్ అనే వాదన వినిపిస్తుంది.