
శాసనసభ ఎన్నికలలో ఓడిపోయినప్పటి నుంచి కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో కాలక్షేపం చేస్తుండగా, జగన్ తాడేపల్లి ప్యాలస్‌లో కాలక్షేపం చేస్తున్నారు.
ఇద్దరూ సంక్రాంతి తర్వాత గృహ నిర్బందం నుంచి విడుదలవుతామని చెప్పుకున్నారు. సంక్రాంతి పండుగ అయిపోయి అప్పుడే 15 రోజులు గడిచిపోయాయి. కనుక ఇద్దరూ బోనులో నుంచి ఎప్పుడు బయటకు వస్తారని వారి వారి పార్టీల నేతలు ఓపికగా ఎదురుచూస్తున్నారు.
Also Read – బురద జల్లుతున్నా బాబు ప్రతిష్ట ఇలా పెరిగిపోతోందేమిటి?
లండన్ వెళ్ళిన జగన్ ఈరోజే బెంగళూరు తిరిగి వచ్చేశారు. లండన్‌లో బాగా రిఫ్రెష్ అయ్యి తిరిగి వచ్చారు కనుక త్వరలోనే జనం మద్యకు వచ్చే అవకాశం ఉంది.
ఈరోజు ఫామ్‌హౌస్‌లో తనని కలిసిన బిఆర్ఎస్ పార్టీ నేతలతో కేసీఆర్ మాట్లాడుతూ, “, ఏడాది కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అస్తవ్యస్తం అయిపోయింది. నేను ఫామ్‌హౌస్‌లో పడుకున్నానని విమర్శిస్తున్నారు. కానీ కాంగ్రెస్ పాలనని మౌనంగా, గంభీరంగా చూస్తున్నాను.
Also Read – వ్యవస్థలకి జగన్ డ్యామేజ్… చంద్రబాబు రిపేర్స్!
నేను కొడితే దెబ్బ మామూలుగా ఉండదు. చాలా గట్టిగానే కొడతాను. ఫిబ్రవరి నెలాఖరున భారీ బహిరంగ సభ పెట్టుకుందాము. దానిని విజయవంతం చేయాలి,” అని అన్నారు. కనుక కేసీఆర్ కూడా జనం మద్యకు వచ్చేందుకు ముహూర్తం పెట్టేసుకున్నట్లు స్పష్టంఅయ్యింది.
అక్కడ కేసీఆర్, ఇక్కడ జగన్ ఇద్దరూ మళ్ళీ రాజకీయాలలో యాక్టివ్ కాబోతున్నారు. కనుక కేసీఆర్ కొట్టబోయే గట్టి దెబ్బని కాసుకునేందుకు రేవంత్ రెడ్డి, జగన్ మొదలుపెట్టబోయే ఏడ్పులు వినేందుకు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, టీడీపీ, జనసేన నేతలు అందరూ సిద్దంగా ఉండక తప్పదు.