సమైక్యాంద్ర, ప్రత్యేక హోదా ఉద్యమాలతో జగన్ విశ్వసనీయత దెబ్బతింది కానీ రాజకీయాలలో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకోవడానికి, ఏపీలో తన పార్టీని బలోపేతం చేసుకోవడానికి ఓదార్పు యాత్రలే ఎంతగానో తోడ్పడ్డాయి.
చంచల్‌గూడా జైలు నుంచి ముఖ్యమంత్రి పీఠం వరకు వెళ్ళిన జగన్, దాని విలువ గుర్తించలేక మళ్ళీ రాజకీయ పాతాళానికి పడిపోయారు. కానీ ఇప్పుడు ఓదార్పు యాత్రలు చేయడానికి ఎవరూ లేరు!
కానీ ఓదార్పు యాత్రలే బాగా కలిసి వచ్చాయి కనుక వాటినే పరామర్శ యాత్రలుగా కాస్త మార్చుకొని సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టాలని జగన్ నిర్ణయించుకున్నట్లున్నారు.
జైలు సెంటిమెంట్ కూడా ఉంది కనుక అక్కడి నుంచే మొదలుపెడితే తప్పకుండా సెకండ్ ఛాన్స్ వస్తుందని జగన్ అనుకున్నట్లున్నారు. కనుక వల్లభనేని వంశీని పరామర్శించే పేరుతో విజయవాడ సబ్ జైలులో ఓ రౌండ్ వేసి పరామర్శ యాత్రలతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. ఈరోజు గుంటూరు మిర్చీ రైతుల కోసం మొసలి కన్నీళ్ళ యాత్ర దిగ్విజయంగా ముగించుకున్నారు.
రేపు (గురువారం) శ్రీకాకుళం జిల్లాలో పాలకొండలో పరామర్శయాత్రకు బయలుదేరబోతున్నారు. ఇటీవల మరణించిన సీనియర్ నేత పాలవలస రాజశేఖరం కుటుంబ సభ్యులను ఓదార్చేందుకు జగన్ రేపు ఉదయం ‘11’ గంటలకు తాడేపల్లి ప్యాలస్ నుంచి బయలుదేరుతారని వైసీపీ ప్రకటించింది.
కనుక ఆనాడు జగన్ ఓదార్పు యాత్రల కోసం ఏవిదంగా గుండెలు పగిలి వరుసగా జనాలు చనిపోయారో అదేవిదంగా ఇప్పుడూ జగన్ పరామర్శ యాత్రల కోసం చనిపోయినవారి జాబితాలు సిద్దం చేసుకోక తప్పదేమో?




