
ఏపీ రాజకీయ ముఖ్య చిత్రంలో వైస్ కుటుంబ రాజకీయాలు అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నాయి. అన్న, చెల్లెళ్ళ మధ్య సాగుతున్న నువ్వా నేనా అనే రాజకీయ పోరు, వ్యక్తిగత ఆధిపత్య ధోరణి ఏపీ రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉన్నాయి.
2024 ఎన్నికల నేపథ్యంలో వైస్ కుటుంబ పోరు ఏపీ ఎన్నికల పై కూడా తీవ్ర ప్రభావం చూపాయి. అందులో వైస్ షర్మిల తన అన్న వైస్ జగన్ ఓటమి కోసం గొంతుకకు మైకు కట్టుకుని మరి పోరాడింది. తన తండ్రి రాజశేఖర్ రెడ్డి మరణం నుంచి బాబాయ్ వివేకా హత్య వరకు ప్రతి అంశంలోనూ జగన్ ను టార్గెట్ చేస్తూ వైసీపీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేసారు.
Also Read – సోము ‘శీల’ పరీక్ష కు సిద్దపడుతున్నారా.?
ఇక షర్మిల గళానికి వివేకా కుమార్తె సునీత పోరాటం తోడవడంతో షర్మిల రాజకీయ ఎన్నికలలో ఓడి అన్న జగన్ మీద నైతికంగా నెగ్గారు. అలాగే వైసీపీ ఘోర ఓటమితో షర్మిల పంతం నెగ్గినప్పటికీ అన్న మీద తన రాజకీయ యుద్ధం మాత్రం కొనసాగిస్తూనే ఉన్నారు. దీనికి సరస్వతి భూముల వివాదం నుంచి తల్లి, చెల్లి మీద జగన్ వేసిన కేసులు, కోర్ట్ వివాదాలు ఇలా జగన్ ప్రతి చర్యలోను ఆయను నీడలా వెంటాడుతుంది షర్మిల.
అటు కుటుంబ పరంగానే కాదు ఇటు రాజకీయ పరంగా కూడా అన్న పై సమయానుకూలంగా, సందర్భానుసారంగా ఎదో ఒక విమర్శ గుప్పిస్తూనే ఉంటున్నారు. రాష్ట్రానికి కావాల్సి ప్రత్యేక హోదా అంశం గురించి మొదలు పెడితే జగన్ కోరుకుంటున్న ప్రతిపక్ష హోదా వరకు ఏ విషయంలో అయినా తగ్గేదెలా అన్నట్టుగా వైసీపీ మీద ఆరోపణలు చేస్తూనే వస్తున్నారు.
Also Read – హస్తినలో అరకు కాఫీ ఘుమఘమలు
అధికారంలో ఉన్నంతకాలం రాష్ట్రానికి, ప్రజలకు కావాల్సిన హోదా కోసం పోరాడలేకపోయి కేంద్రం దగ్గర మెడలు వంచిన జగన్ ఇప్పుడు తనకు ప్రజలివ్వని ప్రతిపక్ష హోదా కావాలంటూ ఆరాటపడడం ఎంతవరకు సమంజసం అంటూ అన్న ఆకాంక్షను ప్రశ్నిస్తూనే ఉన్నారు షర్మిల.
అలాగే ప్రతిపక్ష హోదా ఇవ్వకుంటే అసెంబ్లీకి రాను అంటున్న జగన్ వైఖరి మీద మండిపడ్డారు. ప్రజా తీర్పుని గౌరవించి, ఎమ్మెల్యే లుగా గెలిపించిన నియోజకవర్గ ప్రజలను అవమానిస్తూ, చట్ట సభలలో ప్రజా గొంతు వినిపించలేని పదవులు ఉండి ఎం ప్రయోజనం అంటూ జగన్ అసెంబ్లీకి వెళ్లని వైనాన్ని తప్పుబడుతూ వైసీపీ గెలిచిన ఎమ్మెల్యే లను రాజీనామా చెయ్యాలంటూ డిమాండ్ చేసారు షర్మిల.
Also Read – త్రిభాషా…డీలిమిటేషన్ పై పవన్ స్పందన…
అయితే ఇలా జగన్ తన గొంతు వినిపించినా, వినిపించకపోయినా వైసీపీ మీద ఒక కన్నేసి, జగన్ రాజకీయం మీద ఒక మాటేస్తూ ఉంటారు షర్మిల. అయితే ఏపీలో త్వరలో మొదలుకాబోతున్న అసెంబ్లీ సమావేశాల మీద మళ్ళీ పాత రాగం ఆలపించిన అన్న మీద విరుచుకుపడడానికి షర్మిల ఇంకా బయటకు రాకపోవడం కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.
జగన్ లండన్ పర్యటన ముగించుకుని, బెంగళూరు ఆదిత్యం అందుకుని ఏపీ రాజకీయాలలోకి ప్రవేశించి తాడేపల్లి ప్యాలస్ వేదికగా మీడియా ముందుకొచ్చారు. అయినా కూడా షర్మిల ఇంకా మీడియా ముందుకు రాకపోవడం, తన అన్న మీద ఎటువంటి రాజకీయ ఆరోపణలు చేయకపోవడం వైసీపీ నేతలకు కాస్త ఉరటకలిగించే అంశమనే అయినప్పటికీ మరోసారి షర్మిల వైసీపీ మీద కానీ జగన్ మీద కానీ ఎలా విరుచుకుపడుతుందో అన్న భయం అటు పార్టీ నేతలతో పాటుగా ఆ పార్టీ అధినేతను కూడా వెండాడుతూనే ఉంటుంది.