jagan-mohan-reddy-and-kcr

రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆయా రాష్ట్రాల ఐటీ మంత్రులు తమ రాష్ట్రంలో పెట్టుబడుల వేటకై విదేశీ పర్యటనల బాట పట్టారు. అయితే ఇక్కడ ఏపీ లో పెట్టుబడులు పెట్టడాలంటే పారిశ్రామిక వేత్తలకు భవిష్యత్ లో వైసీపీ అధికారంలోకి వస్తే, జగన్ మరోమారు ముఖ్యమంత్రి పీఠం అధిరోహిస్తే అప్పుడు తమ పరిస్థితి ఏంటి అనే ప్రశ్న వారిని పట్టి పీడిస్తుంది.

అదే తెలంగాణ విషయానికి వస్తే ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మరోమారు అధికారాన్ని చేపట్టకపోయినా, రేవంత్ ముఖ్యమంత్రి కాకపోయినా అక్కడ వారికి బిఆర్ఎస్ పార్టీ తో కానీ ఆ పార్టీ అధినేత కేసీఆర్ తో కానీ ఆ పార్టీ భవిష్యత్ నాయకుడు కేటీఆర్ తో కానీ ఎటువంటి ఇబ్బంది లేదు. ఒకవేళ భవిష్యత్ లో బిఆర్ఎస్ అధికారాన్ని చేపట్టినా వారు జగన్ మాదిరి రాష్ట్ర వినాశాన్ని కోరుకోరు.

Also Read – అన్న వచ్చాడు…చెల్లి రాలేదే.?

అలాగే వీరు కాంగ్రెస్ ప్రభుత్వంలో, రేవంత్ హయాంలో తెలంగాణలో పెట్టుబడులు పెట్టారు కాబట్టి ఈ పరిశ్రమలు బిఆర్ఎస్ పాలనలో తెలంగాణలో కొనసాగకూడదు అనేలా పారిశ్రామిక వేత్తలను తరిమి కొట్టారు. గతంలో చంద్రబాబు నాయుడు వేసిన ఐటీ పునాది రాయిని ఇప్పటికి ఆ తరువాత వచ్చిన ముఖ్యంనత్రులు విస్తరించాహారే తప్ప వెనక్కి పంపలేదు.

కానీ ఏపీలో జగన్ గత ఐదేళ్లు ఆ తరహా రాజకీయం చెయ్యలేదు. దాడులు, బెదిరింపు, బయపెట్టడాలు, విధ్వంశకర నిర్ణయాలతో లూలూ, అమర్ రాజా, జాకీ వంటి అనేక ప్రముఖ సంస్థలను వెనక్కి తరిమి కొట్టారు.దీనితో వైసీపీ ప్రభుత్వం జగన్ హయాంలో ఐటీ మంత్రికి పరిశ్రమ అనే శ్రమే లేకున్నాడు పోయింది.

Also Read – తండేల్ కాంబోస్..!

ఈ ఒక్క అంశంలోనే పారిశ్రామిక వేత్తలు ఏపీకి తెలంగాణకి మధ్య వ్యత్యాసాన్ని చూస్తున్నారు. గత ఐదేళ్ల జగన్ పాలన, వైసీపీ ప్రభుత్వ విధానాలు పెట్టుబడిదారులకు భవిష్యత్ మీద నమ్మకం లేకుండా చేస్తున్నాయి. అయితే ఏపీలో జగన్ మాదిరి అక్కడ తెలంగాణలో ఇప్పుడు అధికారంలో ఉన్న రేవంత్ కానీ, గతంలో ప్రభుత్వాన్ని నడిపిన బిఆర్ఎస్ కానీ నడుచుకోలేదు.

గత పాలకుల అభివృద్ధి ఫలాలను తమ ప్రభుత్వంలో మరింత ఎక్కువ స్థాయిలో ప్రజలకు అందించాలని, గత పాలకుల కంటే తమ పాలన మెరుగుగా ఉండాలని అభివృద్ధిలో, సంక్షేమ కార్యక్రమాలలో పోటీ పడేవారు నాయకులు. కానీ జగన్ మాత్రం గత పాలకుల ఆనవాళ్లు కూడా రాష్ట్రంలో ఎక్కడ కనిపించకూడదు అనేలా రాష్ట్ర రాజధాని ని సైతం మార్చేశారు.

Also Read – జగన్‌ 2.0: ఏపీకి, చంద్రబాబుకి మరింత కష్టమే!

ఐదేళ్ల వైసీపీ విధ్వంశం ఏపీని ఇప్పటికి శాపంలా పట్టి పీడిస్తుంది. జగన్ ఒక్క ఛాన్స్ తాలూకా వినాశనం భవిష్యత్ తరాన్ని కూడా భయపెట్టేలా చేసింది. అధికారంలో ఉన్నా, లేకున్నా జగన్ మాత్రం ఏపీ మీద పగ సాధిస్తూనే ఉన్నారు. అలాగే అటు తెలంగాణలో బిఆర్ఎస్ మాత్రం తాము అధికారంలో ఉంటే పారిశ్రామికీకరణ, ప్రతిపక్షంలో ఉంటే పోరాటం అనేలా రాజకీయం చేస్తుందే కానీ ఎక్కడ రాష్ట్ర విధ్వంసాన్ని కాంక్షించలేదు.




దీనితో ఏపీకి జగన్ గండం పారిశ్రామిక వేత్తలను బయపెడుతుంటే…తెలంగాణకు కేసీఆర్ అభయం పెట్టుబడిదారులను ఆకర్షిస్తుంది. ఏది ఏమైనా బాబు బ్రాండ్, లోకేష్ మార్క్ రాజకీయాలతో తెలంగాణ తో పాటుగా ఏపీకి పెట్టుబడులు రానున్న మాట వాస్తవం. అయితే వాటిని నిలబెట్టుకుని ఏపీని ఇతర రాష్ట్రాల తో ధీటుగా ప్రగతి పథంలో నడిపించడంలో ఏపీ ప్రజలు కూడా కీలక పాత్ర పోషించాల్సిందే.