
ఏ ప్రభుత్వమైనా అత్యవసర పరిస్థితులలో ప్రభుత్వ భూములను తనాఖా పెట్టి లేదా వేలంవేసి అవసరమైన డబ్బు సమకూర్చుకుంటుంది. కానీ జగన్ ప్రభుత్వం గత 5 ఏళ్ళలో ప్రభుత్వ కార్యాలయాలను, ప్రభుత్వ కళాశాలలను, ప్రభుత్వ అతిధి గృహాలను, తహసీల్ధార్ కార్యాలయాలను, చివరికి రైతు బజారులను కూడా తాకట్టు పెట్టేశారు.
ఇదివరకు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర పత్రికలు ఈ విషయం బయటపెట్టాయి. కానీ అవి జగన్‌పై ద్వేషంతోనే ఆవిదంగా దుష్ప్రచారం చేస్తున్నాయని ప్రజలు భావించేవారు. కానీ నేడు సాక్షాత్ సిఎం చంద్రబాబు నాయుడు శాసనసభలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా విశాఖ నగరంలో ఏ ఏ ఆస్తులను జగన్ తాకట్టు పెట్టేశారో వివరించారు.
Also Read – వాఘా మూసేసి సరిహద్దులు తెరుస్తామంటున్న పాక్ పాలకులు!
జగన్ విశాఖని రాజధాని చేస్తానని నమ్మబలుకుతూ అనేక ప్రభుత్వ ఆస్తులను బ్యాంకుల వద్ద తాకట్టు పెట్టేసి రూ.1,941 కోట్లు అప్పులు తీసుకున్నారని సిఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. ఇవికాక మరో రూ.40,000 కోట్లు విలువ కలిగిన ఆస్తులను వైసీపి నాయకులు కబ్జాలు చేశారని సిఎం చంద్రబాబు నాయుడు చెప్పారు.
ఇది కాక ఇతర జిల్లాలలో ప్రభుత్వ ఆస్తులను ఎన్ని తాకట్టు పెట్టారు? వాటిపై ఎంత సొమ్ము అప్పు చేశారు? అనే విషయాలు త్వరలోనే బయటపెడతానన్నారు. ఒక్క ఛాన్స్ ఇమ్మనమని ప్రజలను బ్రతిమాలుకొని అధికారంలోకి వచ్చిన జగన్, రాష్ట్రాన్ని, ప్రభుత్వ ఆస్తులను దోచేసుకున్నారని సిఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. ఆనాడు మీడియాలో ఈ వార్తలు వస్తే ఎల్లో మీడియా దుష్ప్రచారం అని చెప్పి తప్పించుకున్నారు. కానీ ఇప్పుడు సాక్షాత్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాసనసభలో చెప్పిన ఈ వివరాలను జగన్ లేదా వైసీపి నాయకులు ఎవరైనా ఖండించగలరా?