
ఏ రాష్ట్రంలోనైనా శాసనసభ సమావేశాలు జరుగుతుంటే వాటిలో చర్చించే అంశాలు, అధికార ప్రతిపక్షాల వాదనలకు సంబందించిన వార్తలు వస్తుంటాయి. కానీ ఆంధ్రాలో మాత్రం శాసనసభ సమావేశాలు మొదలైతే వైసీపీ అధినేత జగన్‌కి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా గురించే ఎక్కువగా వినిపిస్తుంటుంది.
Also Read – కొరకరాని కొయ్యలా పవన్ ….. ఎలా డీల్ చేయాలబ్బా!
ఆయన ఈ వంకతో శాసనసభ సమావేశాలకు రాకుండా తప్పించుకు తిరుగుతున్నప్పటికీ, ఈ అంశం మీడియాలో హైలైట్ అయ్యేలా చేసుకోగలుగుతున్నారు. తద్వారా శాసనసభకు ఎందుకు వెళ్ళడంలేదని నిలదీయాల్సిన మీడియా ప్రతినిధులను ఆయనే తెలివిగా డైవర్ట్ చేస్తున్నారు.
అంతేకాదు.. “శాసనసభకు రాకుండా తాడేపల్లి ప్యాలస్‌లో కూర్చొని కామెంట్స్ చేసేవాడికి మేమెందుకు జవాబులు ఇవ్వాలి?” అని ప్రశ్నిస్తున్న టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేల చేతనే శాసనసభలో తన గురించి, తాను మాట్లాడుతున్న ఇటువంటి మాటల గురించి మాట్లాడిస్తున్నారు కూడా.
Also Read – రాజకీయాలలో ట్రైలర్లు.. సినిమాలు ఇక తప్పవు!
శాసనసభకు రానందుకు అందరి ముందు తల దించుకోవలసిన జగన్, తాడేపల్లి ప్యాలస్‌లో కూర్చొని అందరినీ నిందిస్తూ మీడియాని డైవర్ట్ చేస్తూ, తనపై ఈగ వాలకుండా జాగ్రత్తపడుతుండటం చూస్తుంటే, ఈ తెలివితేటలు రాష్ట్రాభివృద్ధికి సక్రమంగా ఉపయోగించి ఉండి ఉంటే ఆయన, వైసీపీ, ఆంధ్రప్రదేశ్ ఎక్కడో ఉండేవి కదా?అని అనిపించక మానదు.
అగ్గిపుల్లతో దీపం వెలిగించొచ్చు.. కొంపకు నిప్పెట్టవచ్చు కూడా. అటువంటి వినాశకరమైన ఆలోచనా ధోరణి కారణంగానే జగన్ వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు వైసీపీ కూడా నష్టపోయింది!
Also Read – పాదయాత్ర: చరిత్ర కాదు…భవిష్యత్తే..!
ప్రస్తుతం శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి కనుక జగన్ మళ్ళీ తాడేపల్లి ప్యాలస్‌లో కూర్చొని ముందుగా ‘ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా’ గీతాలపన చేశారు. ఆ తర్వాత ‘శాసనసభ సమావేశాలు సిఎం చంద్రబాబు నాయుడు ఆత్మస్తుతి, పరనిందతో సాగిపోయిందంటూ’ విమర్శలు గుప్పించి, తన పాలన ఎంత అద్భుతంగా సాగిందో డప్పు కొట్టుకున్నారు. అంటే జగన్ కూడా ప్యాలస్‌లో కూర్చొని అదే చేశారన్న మాట!
తాడేపల్లి ప్యాలస్‌లో కూర్చొని ప్రెస్‌మీట్లు పెడుతూ జగన్ తాను చాలా తెలివిగా మాట్లాడుతున్నానని నమ్ముతున్నారు. కానీ ఆయన మాట్లాడుతున్న ఈ మాటలన్నీ వింటున్న ప్రజలు నవ్వుకుంటుంటే వారికి మొహాలు చూపలేక వైసీపీ నేతలు, కార్యకర్తలు సిగ్గుతో తలదించుకోవలసి వస్తోంది.
కానీ మూడు రాజధానుల జగన్ మార్క్ రాజకీయాలు ఈవిదంగానే ఉంటాయి. డీఎన్ఏలో లోపం ఉంటే ఎవరేం చేయగలరు?