జగన్ పాదయాత్ర వైసీపీ కి ‘సంజీవని’ కానుందా.?

Jagan Mohan Reddy Padayatra

వై నాట్ 175, ప్రతిపక్షం లేని ఏకైక రాష్ట్రం గా ఏపీ, వై నాట్ కుప్పం.? వై నాట్ మంగళగిరి.? వై నాట్ పిఠాపురం.? అంటూ బాబు, పవన్, లోకేష్ లను సైతం అసెంబ్లీ గేటు తాకనివ్వం అంటూ నాడు రెచ్చిపోయిన వైసీపీ నేడు 11 సీట్లతో కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేక చివరికి అదే అసెంబ్లీ గేటు తాకేందుకు భయపడుతుంది.

ఇటువంటి దారుణ ఓటమి నుంచి, ఘోర అవమానాల నుంచి వైసీపీ తిరిగి రాజకీయంగా ప్రాణం పోసుకునేందుకు వైసీపీ ముందున్న ఏకైక రాజకీయ అస్త్రం జగన్ పాదయాత్ర మాత్రమే అని జగన్ బలంగా విశ్వసిస్తున్నారు. ఒక పక్క పార్టీ బలమైన పునాదులుగా ఉన్న నేతలంతా జగన్ ని కాదని వైసీపీ కి గుడ్ బై చెపుతున్నారు.

ADVERTISEMENT

మరోపక్క వైఎస్ కుటుంబ వివాదాలు జగన్ ను నైతికంగా దిగజారుస్తున్నాయి. వివేకా దారుణ హత్య, అందుకు సునీత చేస్తున్న ఆరోపణలు, మరోపక్క సొంత తల్లి పై జగన్ వేస్తున్న కేసులు, ఆస్తి కోసం చెల్లి షర్మిలతో నడుస్తున్న విభేదాలు వైసీపీ ని మానసికంగా కుంగదీస్తున్నాయి.

దానికి తోడు రాష్ట్ర రాజధాని అమరావతి విషయంలో జగన్ పడుతున్న మొండి పట్టు కూడా వైసీపీ కి రాజకీయ ఇబ్బందులు సృష్టిస్తున్నాయి. ఇక కూటమి ప్రభుత్వం తన పాలనా విధానాలతో ఒక పక్క అభివృద్ధితో మరోపక్క సంక్షేమం తో ముందుకు సాగుతుంది.

రాజధాని అమరావతి మొదలు భోగాపురం, వెలికొండ, పోలవరం, దశాబ్దాలుగా కనీస మౌలిక వసతులు కూడా లేని మారుమూల గిరిజన ప్రాంతాలలో రహదారుల నిర్మాణం వంటి అనేక కార్యక్రమాలతో దూసుకుపోతుంది. ఇటువంటి పరిస్థితులలో వైసీపీ రప్ప రప్ప రాజకీయాలకు ఏపీలో ఆస్కారం ఉంటుందా.? అంటే జగన్ పాదయాత్ర వాటన్నింటిని తుడిచిపెట్టి వైసీపీ కి అనుకూల పరిస్థితులను తెస్తుంది అనే ఒక బలైమన నమ్మకంతో ఉన్నారు వైసీపీ శ్రేణులు.

జగన్ పాదయాత్ర వైసీపీ కి సంజీవని అని పార్టీ అధినేత వైఎస్ జగన్ నుంచి ఆ పార్టీ క్యాడర్ వరకు అందరు విశ్వసిస్తున్నారు. రానున్న ఏడాదిలో జగన్ తన పాదయాత్రకు ప్రణాళికలు మొదలుపెడుతున్నారు. వైసీపీ ఘోర ఓటమి తరువాత ప్రజా తీర్పుకి కనీస గౌరవం ఇవ్వకుండా వైసీపీ 11 మంది ఎమ్మెల్యే లు అసెంబ్లీ కి గైర్హాజరవుతున్నారు.

పరామర్శ యాత్రలు, ఓదార్పు యాత్రల పేరుతో రోడ్ల మీద రప్ప రప్ప రాజకీయాలను ప్రోత్సహిస్తూ జగన్ చేస్తున్న ఈ తరహా రాజకీయం పాదయాత్ర తో పార్టీకి సంజీవని అవుతుందా.? జగన్ మావిగన్ ప్రకటన జగన్ పాదయాత్రతో ప్రజల వద్ద ఆమోదముద్ర వేసుకుంటుందా.?

గత ఐదేళ్ల వైసీపీ పాలనా తాలూకా చేదు జ్ఞాపకాలను, ఈ మూడేళ్ళ వైసీపీ విపక్ష ఫెయిల్యూర్ ను జగన్ తన పాదయాత్రతో ప్రజల మనసు నుంచి తుడిచేయగలరా.? నాటి పరదాల యాత్ర గుర్తులను నేటి పాదయాత్ర చెరిపేయగలదా.? వైసీపీ ముందున్న అన్ని రాజకీయ ప్రతికూలతకు జగన్ పాదయాత్రే దివ్యఔషధమా.?

ADVERTISEMENT
Latest Stories