జగన్ రాజకీయం పార్టీ క్యాడర్ సంతోషానికేనా.?

Jagan Mohan Reddy addressing YSRCP cadre highlighting political strategy and voter disconnect debate

ఒక స్టార్ హీరో కేవలం తన అభిమానుల కోసమే సినిమాలు తీస్తే దాని రిజల్ట్ ఎలా ఉంటుందో ఇప్పుడు జగన్ చేస్తున్న రాజకీయం కూడా సరిగ్గా అలానే కనిపిస్తుంది. కేవలం తన పార్టీ క్యాడర్ ని సంతోష పెట్టడానికి, వైసీపీ నాయకులను లైవ్ లైట్ లో ఉంచడానికి మాత్రమే జగన్ రాజకీయం పనికొస్తుంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

అయితే గతంలో కూడా జగన్ ఇదేమాదిరి అసలు వాస్తవాలను పార్టీ క్యాడర్ కి తెలియనివ్వకుండా వై నాట్ 175 కి సిద్ధమా అంటూ సాక్షి గ్రాఫిక్స్ మాయాజాలంతో పార్టీ శ్రేణుల కళ్లుకప్పారు, ఐ ప్యాక్ ప్రచారాలతో నాయకుల చెవులు మూసారు.

ADVERTISEMENT

దాని ఫలితం టీం 11 గా ప్రతిపక్ష హోదా కూడా లేని పార్టీగా మిగిలింది వైసీపీ. ఇక ఇప్పుడు కూడా జగన్ అదేమాదిరి రాజకీయం చేస్తూ పార్టీ క్యాడర్ ని కాపాడుకునే పనిలో పడ్డారు. ఇప్పటికే జగన్ రాజకీయ విధానాలతో, వైసీపీ రాజకీయంతో విసిగిపోయిన ప్రజలకు మావిగన్ అంటూ జగన్ మరో మింగుడు పడదని బ్రహ్మపదార్ధాన్ని రుచి చూపించారు.

దీనితో కక్కలేక మింగలేక జగన్ ను ఫాలో అవుతూ దిక్కు తోచక చూస్తున్న పార్టీ క్యాడర్ కళ్ళలో ఆనందం కోసం జగన్ కొన్ని ప్రకటనలు చేసారు. రాబోయే ఏడాదిలో తానూ పాదయాత్రతో ప్రజల మధ్యకొస్తాన్ని, ఇక అప్పటి నుంచి బాబుకి ప్రతి రోజు ఒక సినిమా చూపిస్తానని,

ఆ రాబోయే ఎన్నికలలో బాబు కి సింగిల్ డిజిట్ కూడా రాదంటూ గాల్లో వైసీపీ క్యాడెర్ కి జగన్ మేడలు చూపిస్తున్నారు. జగన్ చేస్తున్న ఇటువంటి వ్యాఖ్యలతో పార్టీ క్యాడర్ నుంచి విజిల్ పడొచ్చు కానీ ఓటర్ల నుంచి ఓట్లు పడవనేది వైసీపీ ఎప్పటికి గ్రహిస్తుందో.?

మొన్న సీఎం బాబు పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబటి రాంబాబు కోసం పరామర్శ యాత్రకు వెళ్లి అక్కడ రాంబాబు ని కాపు టైగర్ అంటూ ప్రకటించి అక్కడున్న వైసీపీ క్యాడర్ తో చప్పట్లు కొట్టించుకున్నారు, కానీ కట్ చేస్తే ఆ సంఘటన తో వైసీపీ కి రాజకీయ మైలేజ్ కి బదులు డ్యామేజ్ యే ఎక్కువ జరిగింది.

అలాగే తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వివాదంలో కూడా వైసీపీ అనుసరించిన విధానాలు ఆ పార్టీని సామాన్య ప్రజానీకానికి, ఒక సగటు వెంకన్న భక్తుడికి పార్టీని శాశ్వతంగా దూరం చేసిందనే చెప్పాలి. స్వామి వారి చిత్ర పటం తో వైసీపీ నాయకులు చట్ట సభలకు వెళ్లడం, అక్కడ కల్తీ విషయాన్ని పక్కన పెట్టి జంతు కొవ్వు అంశాన్ని సాగతీయడం వంటి చర్యలతో వైసీపీ క్యాడెర్ సంతృప్తి పడొచ్చు కానీ ఆ గోవిందుని భక్తులు సంబరపడతారా.?

ఇక ప్రస్తుతం ఏపీలో ట్రేండింగ్ అవుతున్న మావిగన్ ప్రకటన తో కూడా జగన్ తన పార్టీ క్యాడర్ నుంచి జై జై లు కొట్టించుకోవచ్చు, తమ పార్టీ లీడర్ల దగ్గర గొప్ప విజనరీ నేతగా ప్రశంసలు దక్కించుకోవచ్చు కానీ ఆ ప్రకటనలు వైసీపీ కి సామాన్య ఓటర్ ని దూరం చేసేస్తుంది, జగన్ ను నవ్వులపాలు చేస్తుంది.

ఇలా జగన్ తన పార్టీ క్యాడర్ సంతోషానికి ఒక సారి రప్ప రప్ప అని, మరోసారి వైసీపీ 2.0 అని, ఇంకోసారి ఈసారి ప్లాన్ బి మావిగన్ అంటూ. పార్టీ లీడర్లు చేసే బూతు రాజకీయాలను ప్రోత్సహించుకుంటూ ముందుకెళితే ఆ రాజకీయం కేవలం వైసీపీ కార్యకర్తల కళ్లుకప్పడమే అవుతుంది ఆ పార్టీ నాయకుల రాజకీయ భవిష్యత్ ని సమాధి చెయ్యడమే అవుతుంది.

ADVERTISEMENT
Latest Stories