ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకి ఆమె సోదరుడు జగన్మోహన్ రెడ్డి మద్య ఆస్తుల పంచాయితీ మరోసారి మీడియాకు చేరడంతో జగన్‌కు, వైసీపీ నేతలకు చాలా ఇబ్బందికరంగా మారింది. ముందుగా తల్లి విజయమ్మ తన కొడుకు జగన్ చెల్లిని, ఆమె పిల్లలను మోసం చేశాడంటూ లేఖ విడుదల చేయడంతో జగన్‌కి ప్రజల ముందు తలెత్తుకోలేని పరిస్థితి ఏర్పడింది.
ఆమెలాగ నేరుగా మాట్లాడలేరు కనుక వైసీపీ నేతలతో చెప్పించారు. వాటిపై వైఎస్ షర్మిల ఇంకా ఘాటుగా స్పందించారు.
“నా ఆస్తినే నా అన్న జగన్ అనుభవిస్తున్నాడు తప్ప నేను అతని ఆస్తిని అనుభవించడం లేదు. నాకు నా సొంత అన్న అన్యాయం చేసినా నేను మౌనంగా తెలంగాణ వెళ్ళిపోయాను తప్ప ఒక్క మాట అనలేదు. ఆస్తి కోసమే నేను ఆరాటపడుతున్నట్లయితే తెలంగాణ వెళ్ళేదానినా?
నా చేతిలో ఉన్న ఆస్తి తాలూకు పత్రాలతో కోర్టుకు వెళ్ళకుండా ఉంటానా? మా కుటుంబ గౌరవం కోసం నేను మౌనంగా ఉండిపోయినప్పటికీ, జగన్మోహన్ రెడ్డి స్వయంగా కోర్టుకి వెళ్ళి ఈ ఆస్తుల పంచాయితీని బయటపెట్టుకున్నారు. తల్లి, చెల్లి అని చూడకుండా మమ్మల్ని కోర్టు కీడ్చాడు.
తనంతట తానే ఈ పంచాయితీని రోడ్డుపైకి తెచ్చిపెట్టుకొని ఇప్పుడు మేమేదో మాట్లాడితే జవాబు చెప్పకుండా తన కుక్కలని మాపై ఉసిగొల్పుతున్నారు. ఆ కుక్కల అరుపులకి నేను భయపడేదానిని కాను,” అంటూ షర్మిల ఘాటుగా బదులిచ్చారు.
మళ్ళీ ఆమెకు వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సమాధానం చెపుతూ, “అవును మేము జగన్ ఇంట్లో కుక్కలమే. మా యజమానికి ఎవరైనా హాని తలపెడితే మేము తప్పకుండా మొరుగుతాము,” అంటూ ఈ ఆస్తుల పంచాయితీ గురించి కొన్ని విషయాలు మాట్లాడారు.
ఆయన మాటలపై వైఎస్ షర్మిల కూడా స్పందిస్తూ, “అమ్మా షర్మిలమ్మా నువ్వు వైసీపీ వాళ్ళని కుక్కలతో పోల్చకు తల్లీ! కుక్కలు బాధపడతాయన్నారు,” అంటూ వ్యంగ్యంగా అన్నారు.
ఈ ఆస్తుల పంచాయితీ గురించి వైసీపీ నేతలు ఎంత ఎక్కువగా మాట్లాడితే అంతగా వారికి, వారి పార్టీకి, అధినేత జగన్‌కి పరువు నష్టం. ప్రజల దృష్టిలో మరింత చులకనవుతారు. ఎందుకంటే అవతలివైపున్నది టీడీపి లేదా జనసేన అధినేతలు కారు. సొంత తల్లి, చెల్లి!
అంత మాట అనేసింది ఏంటి షర్మిల అక్క
ఇది విన్నావా వైస్ భారతి రెడ్డి .. pic.twitter.com/0RlWR2wBsO
— మన ప్రకాశం (@mana_Prakasam) March 25, 2026




