జైలుకి ఒకే.. కానీ కోర్టుకి శాసనసభకి నాట్ ఓకే.. వై?

Jagan court absence

జగన్మోహన్ రెడ్డికి జైలుకి అవినాభావ సంబంధం ఉంది. ఆక్రమాస్తుల కేసులలో 16 నెలలు చంచల్‌గూడా జైలులో గడిపి బెయిల్‌పై బయటకు వస్తే అదృష్టం కలిసివచ్చి ఏపీకి ముఖ్యమంత్రి కాగలిగారు.

ADVERTISEMENT

కానీ మరో 25-30 ఏళ్ళు తానే ముఖ్యమంత్రిగా ఉందామనుకున్న జగన్‌, ఆ జైలు సెంటిమెంట్ మరిచిపోయి చంద్రబాబు నాయుడుని జైలుకి పంపి దెబ్బయిపోయారు.

కనుక అధికారం కోల్పోయినప్పటి నుంచి తాడేపల్లి ప్యాలస్‌నే జైలుగా మార్చుకొని ఒంటరి జీవితం గడుపుతూ, అవకాశం చిక్కినప్పుడల్లా వైసీపీ నేతలను పరామర్శించే పేరుతో జైల్లోకి వెళ్ళి కాసేపు గడిపివస్తున్నారు.

కానీ ఏదో కేసులో అరెస్ట్‌ అయ్యి జైల్లో గడిపితే తప్ప సెంటిమెంట్ వర్కవుట్ కాదనే సంగతి గ్రహించిన్నట్లు లేరు. ఆయన ఏ కారణం చేత జైల్లోకి వెళ్ళి గడిపి వస్తున్నప్పటికీ, దాని వలన ఏమాత్రం లాభం కలుగకపోగా రకరకాల విమర్శలు ఎదురవుతున్నాయి.

“జైల్లో వైసీపీ నేతలను పరామర్శించేందుకు తీరిక ఉంది కానీ శాసనసభ సమావేశాలకు వెళ్ళేందుకు తీరిక లేదా? శాసనసభకు వెళ్ళదలచుకోకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేవచ్చు కదా?” అంటూ చెల్లి షర్మిల బాణం వేస్తే అది బొత్స సత్యనారాయణకి గుచ్చుకుంది.

తాజాగా కోడికత్తి కేసులో జగన్‌పై ఇదే కోణంలో మరో బాణం పడింది. విశాఖపట్నం ఎన్‌ఐఏ న్యాయస్థానంలో శుక్రవారం ఈ కేసు విచారణకు నిందితుడు శ్రీను హాజరయ్యాడు కానీ అతనిపై ఈ కేసు వేసిన జగన్‌ హాజరుకాలేదు! దీంతో ఈ కేసు తదుపరి విచారణ మార్చి 21కి వాయిదా పడింది.

ఈ సందర్భంగా దళిత ఐక్య వేదిక కన్వీనర్ బూసి వెంకట్రావు విశాఖలో మీడియాతో మాట్లాడుతూ, “దళితుడిపై దాడి, కిడ్నాప్ కేసులో జైలుకి వెళ్ళిన వల్లభనేని వంశీని పరామర్శించడానికి జగన్‌కి సమయం ఉంది. కానీ ఈ కేసులో కోర్టుకి హాజరయ్యేందుకు జగన్‌కి సమయం లేదా?

ఇప్పటికే ఈ కేసు 20 సార్లు వాయిదా పడింది. ఇంకా ఎన్ని వాయిదాలు పడాలి? ఇదివరకు ఆయన ముఖ్యమంత్రి కనుక రాలేదని సరిపెట్టుకోవచ్చు. కానీ ఇప్పుడు కేవలం ఎమ్మెల్యే మాత్రమే కదా?మరి కోర్టుకి రావడానికి జగన్‌కి నామోషీ దేనికి?” అని ప్రశ్నించారు.

నిజమే కదా జైళ్లోకి వెళ్ళి వచ్చేందుకు నామోషీ లేనప్పుడు కోర్టుకి, శాసనసభకి వెళ్ళేందుకు జగన్‌ ఎందుకు నామోషీగా ఫీల్ అవుతున్నారు?

జగన్‌ పదేపదే జైల్లోకి వెళ్ళివస్తున్నా ఆయన ‘పీలింగ్స్’ సిఎం చంద్రబాబు నాయుడు అర్ధం చేసుకోలేకపోతున్నారా?ఒకవేళ అర్దమైనా జగన్‌కు మేలు చేయకూడదని అనుకుంటున్నారా?అనే ధర్మ సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

ADVERTISEMENT
Latest Stories