ys-sharmila-ys-jagan--

ఎక్కడైనా అధికార, ప్రతిపక్షాలు పరస్పరం విమర్శించుకోవడం సహజమే. ఒకవేళ ప్రతిపక్షంలో రెండు మూడు పార్టీలు ఉన్నట్లయితే అవి కూడా పరస్పరం విమర్శలు చేసుకోవడం సహజమే. అయితే ఏపీలో ఇదివరకు ప్రతిపక్షమంటే టీడీపీ, ఇప్పుడు వైసీపీ మాత్రమే అని ప్రజలు భావిస్తుంటారు. కానీ వైఎస్ షర్మిల వచ్చిన తర్వాత నుంచి రాష్ట్రంలో కాంగ్రెస్‌ కూడా ఉందని గుర్తు చేస్తున్నారు.

Also Read – రేవంత్ రెడ్డి…మరో జగన్ రెడ్డి కానున్నారా.?

అయితే ఆమె ప్రధానంగా అధికార టీడీపీ కూటమి ప్రభుత్వం తప్పొప్పుల గురించి మాట్లాడవలసి ఉండగా, ఆమె ప్రధానంగా అన్న జగన్మోహన్ రెడ్డినే టార్గెట్ చేసుకొని విమర్శలు గుప్పిస్తుండటం విశేషం. అందుకే ఆమె ఇప్పుడు ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు ప్రయోగించిన బాణంగా మారారని జగన్‌, వైసీపీ నేతలు విమర్శిస్తుంటారు.

తన బాణం గురితప్పడమే కాకుండా, ప్రత్యర్ధి అమ్ములపొదిలో చేరి తిరిగి తనపైకే దూసుకువస్తుండటం జగన్‌కు చాలా ఇరకాటంగానే ఉంది. ఆమె స్థానంలో మరొకరు ఎవరైనా ఉండి ఉంటే జగన్‌, వైసీపీ నేతలు ఎదురుదాడి ఊహించనంత భయంకరంగా ఉండేది.

Also Read – జగన్‌ మోడల్ బెస్ట్ అంటున్న రేవంత్ రెడ్డి!

కానీ ఆమె సొంత చెల్లెలు కావడంతో వైసీపీ చాలా ఆచితూచి స్పందించాల్సి వస్తోంది. ఆమెపై కొద్దిగా విమర్శలు చేస్తేనే ‘జగన్‌ సొంత చెల్లి అని కూడా చూడకుండా బురద జల్లుతున్నాడు’ అనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. సానుభూతి సంపాదించి పెట్టడానికి అవే చాలు ఆమెకు.

కనుక జగన్‌ ఈ బలహీనత ఆమెకు ఆయుధంగా మారిందని చెప్పవచ్చు. దానిని ఆమె సద్వినియోగం చేసుకుంటూ అన్నపై ఎదురుదాడి చేస్తూనే ఉన్నారు.

Also Read – మంచి ప్రశ్న వేశారు మద్యలో ఆవు కధ దేనికి భూమనగారు?

తాజాగా అదానీ వ్యవహారంలో ‘లంచాలు తీసుకోలేదని నీ బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్పగలవా?’ అంటూ వైఎస్ షర్మిల నిలదీశారు. అదానీతో విద్యుత్ కొనుగోలు ఒప్పందం వలన రాష్ట్రానికి చాలా నష్టం కలుగుతుందని, ప్రజలపై చాలా భారం పడుతుందని తెలిసినా రూ.1750 కోట్లు కోసం కక్కుర్తి పడ్డావని వైఎస్ షర్మిల అన్నని విమర్శించడం అందరినీ ఆలోచింపజేస్తోంది.

ఈ వ్యవహారంపై ప్రస్తుతం పార్లమెంటులో కూడా కాంగ్రెస్‌ మిత్రపక్షాలు మోడీ ప్రభుత్వాన్ని నిలదీస్తుంటే, ఇక్కడ ప్రధాన ప్రతిపక్షహోదా కోసం మారాం చేస్తున్న జగన్‌ అదానీ వ్యవహారంపై నోరు విప్పి మాట్లాడలేకపోతున్నారు.

ఈ వ్యవహారంలో తన పేరే వినిపిస్తుండటంతో, టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని నిలదీయలేకపోతున్నారు. పైగా ఇప్పుడు చెల్లి వైఎస్ షర్మిల నిలదీస్తుంటే జవాబు చెప్పలేక అందరి ముందు తలదించుకోవలసి వస్తోంది కూడా.




తాను ప్రత్యర్ధులపైకి సందించిన బాణం తిరిగి వచ్చి ఈవిదంగా తనకే పదేపదే గుచ్చుకుంటుందని బహుశః జగన్‌ ఎన్నడూ ఊహించి ఉండరేమో?ఉంటే ఆమెను రాజకీయాలలో అడుగుపెట్టనీయకుండా ఆస్తులు పంచిపెట్టేసి ఉండేవారేమో?