ys-jagan-cases

ఓ ఇంట్లో దొంగతనం జరిగింది. పోలీసులు దొంగలను పట్టుకున్నారు. దొంగతనానికి సహకరించివారిని కూడా కనిపెట్టారు. దొంగతనం జరుగుతుండగా చూసిన సాక్షుల నుంచి కూడా సాక్ష్యాధారాలు సేకరించారు. దొంగలను, వారికి సహకరించినవారిని అందరినీ కోర్టులో హాజరుపరిచారు. వారు దొంగతనం చేశారా..లేదా?అని కోర్టులు నిర్ధారించాలి. కానీ నిర్ధారించలేకపోతున్నాయి.. ఎందువల్ల?

Also Read – జగన్‌కి ఓదార్పు కావాలి.. ఎవరైనా ఉన్నారా ప్లీజ్?

జగన్‌ ఆక్రమస్థుల కేసుల విచారణలో ఇదే జరుగుతోంది. పదేళ్ళుగా విచారణ సాగుతున్నా ఇంత వరకు పూర్తికాలేదు. కనీసం ఒక్క అడుగు ముందుకు పడలేదు.

ఈ కేసులో నిందితులు అనేక ఉప-పిటిషన్స్ వేస్తూనే ఉన్నారు. ఈ కేసులో డిస్‌ఛార్జ్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ఐదుగురు జడ్జీలు బదిలీ అయ్యారు.

Also Read – జగన్‌ మొదలెట్టేశారు.. విజయసాయి రెడీయా?

ఈ కేసు ఎన్నిసార్లు వాయిదా పడుతున్నా సీబీఐ అభ్యంతరం చెప్పడం లేదు. అంటే తీర్పు వెలువడకుండా, నిందితులకు శిక్ష పడకుండా సీబీఐయే వారికి సహకరిస్తోందని ఉండి ఎమ్మెల్యే, ఏపీ డెప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు తరపు న్యాయవాది సుప్రీంకోర్టులో కుండ బద్దలు కొట్టిన్నట్లు చెప్పేశారు.

చట్టాలలో లొసుగులను, రాజకీయ పరపతిని, పరిచయాలను నిందితులు తెలివిగా వాడుకుంటూ కేసుల విచారణ ముందుకు సాగానీయడం లేదని ప్రతీ ఒక్కరికీ తెలుసు.

Also Read – అన్న వచ్చాడు…చెల్లి రాలేదే.?

ఈ కేసులలో ఏ-1గా జగన్‌ ఏపీకి ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు పాలించారు. అందువల్లే ఏపీ నుంచి తెలంగాణకు కేసు విచారణ బదిలీ అయ్యింది.

ఈ కేసు ఏ-2గా ఉన్న విజయసాయి రెడ్డి నిత్యం ప్రధాని మోడీ లేదా కేంద్రమంత్రులతో ఫోటోలు దిగుతూ సోషల్ మీడియాలో పెడుతుంటారు.

నిందితులు ఈవిదంగా కేసు విచారణ జరుపుతున్నవారిని ప్రభావితం చేస్తుండగా, వారి న్యాయవాదులు చట్టాలలో లొసుగులను తెలివిగా ఉపయోగించుకుంటూ ఈ కేసుల విచారణ పూర్తికాకుండా నిలువరిస్తున్నారు… అని తెలిసిన సీబీఐ ఈ కేసులతోనే బ్రతికేస్తోంది… అని తెలిసిన న్యాయవ్యవస్థలు ఏళ్ళ తరబడి విచారణ జరుపుతూనే ఉన్నాయి. కనుక ఎప్పటికైనా ఈ కేసుల విచారణ పూర్తవుతుందని ఆశించడం అత్యాశే.. కదా?

ఈ నేపధ్యంలో ఈ కేసులని ఏ రాష్ట్రానికి బదిలీ చేసి ఏం ప్రయోజనం?తెలంగాణలో కూడా విచారణ పూర్తవనప్పుడు వేరే రాష్ట్రంలో పూర్తవుతుందని ఎలా అనుకోగలము?

ఈ కేసులు విచారణ ఎందుకు పూర్తవడంలేదో సుప్రీంకోర్టు, తెలంగాణ హైకోర్టు, సీబీఐ, ఈ కేసులని వాదిస్తున్న ఇరు పక్షాల న్యాయవాదులకు తెలియదా?అంటే బాగా తెలుసు. తెలిసినా ఏమీ చేయలేకపోవడాన్ని వారి నిసహాయత అనుకోవచ్చు.

న్యాయవ్యవస్థపై రాజకీయ ప్రభావం ఉంటుందని చెప్పడానికి పదేళ్ళుగా సాగుతున్న ఈ కేసుల విచారణే నిదర్శనం కాదా?

కనుక ఈ కేసుల విచారణ పేరుతో వంద కోట్లు ప్రజాధనం ఖర్చు అవడం తప్ప ఏం ప్రయోజనం? అని సందేహం కలుగకమానదు.

ఉపాధి హామీ పధకం ద్వారా గ్రామాలలో నిరుపేదలకు ఉపాధి కల్పిస్తున్నట్లే ఈ కేసులు ద్వారా జిరాక్స్ షాపులు మొదలు న్యాయవాదులు, సీబీఐ, మీడియా ఇంకా అనేక మందికి ఉపాధి కల్పిస్తున్నాయి.

ఈ కేసులే లేకపోతే లేదా వెంటనే విచారణ పూర్తయిపోయి ఉంటే ఇంత మందికి ఇన్నేళ్ళు ఉపాధి లభించేది కాదు కదా? కనుక ఈ కేసులు ఉపాధి హామీ పధకాలవంటివే అని భావించవచ్చు. కనుక మరో రెండు మూడు తరాలు ఈ కేసుల విచారణ కొనసాగాలని మనసారా కోరుకుందాం!