జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు అనే ఆరోపణలు తరచు వినిపిస్తూ ఉంటాయి. ఇదే కారణం వల్ల ప్రతిపక్ష పార్టీ వైఎస్సాఆర్ కాంగ్రెస్ ఆయనను విరోధిలా చూస్తూ ఉంటుంది. తరచూ విమర్శలు కూడా చేస్తూ ఉంటాది. ఈ క్రమంలో ఒక ఇంటర్వ్యూలో చంద్రబాబును జనసేనతో పొత్తు గురించి అడిగారు.
“జనసేనతో పొత్తు పరిస్థితుల్ని బట్టి రాజకీయాల్లో అప్పటికప్పుడు పరిస్థితుల్ని బట్టి నిర్ణయాలుంటాయి. జనసేనతో పొత్తు ఉంటుందా? వంటి ఊహాజనిత ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం చెప్పడం సరికాదు,” అని అన్నారు చంద్రబాబు. ముఖ్యమంత్రి ఎప్పటిలానే నర్మగర్భంగా వ్యాఖ్యానించారా లేక పొత్తు విషయం ఇంకా తేలలేదా అనేది తెలియాలి.
మరోవైపు పవన్ కళ్యాణ్ వేసిన నిజనిర్ధారణ కమిటీ నివేదిక ఇంకా రావాల్సి ఉంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తన వాదనను ఒక ప్రత్యేక నివేదిక రూపంలో అందచేసింది. కేంద్ర ప్రభుత్వ వాదన గురించి జనసేన ఒక ఆర్టీఐ అప్లికేషన్ పంపింది. అటు నుండి వివరాలు రావాల్సిందిగా తెలుస్తుంది.



