గత సార్వత్రిక ఎన్నికలలో తెలుగుదేశం పార్టీని తానే గెలిపించాను అన్న ఫోబియా నుండి పవన్ బయటకు రాలేకపోతున్నట్లుగా కనపడుతున్నారు. ఇంత బలంగా ఎందుకు ఫీల్ అవుతున్నారు అన్న విషయం పక్కన పెడితే, తాజాగా పశ్చిమ గోదావరి జిల్లాలో మరో హాస్యాస్పదమైన కామెంట్స్ కు పవన్ నిలయంగా నిలిచారు.
[m9ad]
ఆయన మాటల్లోనే చెప్పాలంటే… “పగోజిల్లా రాజకీయంగా చాలా చైతన్యవంతమైనది, నేను ఒక్క మాట చెప్పినందుకు తెలుగుదేశం పార్టీకి 15 సీట్లు ఇచ్చి అండగా నిలబడ్డారు” అంటూ ఆక్వా ట్రేడర్స్ తో జరిగిన సమావేశంలో చెప్పుకొచ్చారు. ఈ మాటలు వినగానే ఈవీవీ సినిమాలో చేసిన ‘చిటికెలు… చిటికెలు…’ అన్న కామెడీ సీన్ గుర్తుకు రావడం సహజం.
అంటే పవన్ లెక్క ప్రకారం 2019 సార్వత్రిక ఎన్నికలలో పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న 15 అసెంబ్లీ స్థానాలు జనసేన కైవసం చేసుకోబోతోందన్న మాట. ఏంటి జీర్ణించుకోవడానికి కాస్త కష్టమైన విషయమైనా ప్రస్తుతం పవన్ అదే ఊహలలో ఉంటున్నారు మరి! ఒక్క మాట చెప్పినందుకే ఏకంగా 15 స్థానాలు వచ్చేస్తే… ఇప్పుడు చాలా మాటలు సెప్తున్నారు గనుక 175 స్థానాలు గెలిచేస్తారేమో! ఇలా అయితే చంద్రబాబు, జగన్ లు కూడా గెలవడం కష్టమే అన్న మాట!



