టాలీవుడ్ లో “మెగా హీరోల” ఆధిపత్యానికి చెక్?

janatha-garage-all-time-3rd-biggest-hit-telugu-cinemaతెలుగు సినీ చరిత్రలో కలెక్షన్ల పరంగా రికార్డులు సృష్టించిన సినిమాల జాబితాలో ఎప్పుడూ మెగా హీరోల ఆధిపత్యం ఉండేది. ముఖ్యంగా టాప్ 3లో ఎక్కువగా మెగా హీరోల సినిమాలే ఉండేవి. ఒకప్పుడు చిరంజీవి, ఆ తర్వాత పవన్ కళ్యాణ్, కొన్నాళ్ళ పాటు ‘మగధీర’ ద్వారా రామ్ చరణ్ అగ్ర స్థానంలో నిలువగా, ఇప్పుడు వీరందరికీ ఆస్కారం లేకుండా…. చరిత్రలో తొలిసారిగా టాప్ 3 స్థానాలలో ఒక్క మెగా హీరో సినిమా కూడా లేకపోవడం విశేషం.

టాప్ స్థానాన్ని చెక్కు చెదరకుండా ‘బాహుబలి’ ద్వారా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఆక్రమించగా, ఆ తర్వాత ప్రిన్స్ మహేష్ బాబు ‘శ్రీమంతుడు’ సత్తా చూపించాడు. ఇక, తాజాగా ‘జనతా గ్యారేజ్’ ద్వారా నెలకొల్పిన రికార్డులతో మూడవ స్థానం యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు దక్కింది. దీంతో మెగా హీరోలకు సంబంధించిన సినిమాలు క్రింది వరుసకు జరిగాయి. ఆ తర్వాత మాత్రం పవన్ కళ్యాణ్ ‘అత్తారింటికి దారేది’ ద్వారా పదిలంగా ఉన్నారు.

ADVERTISEMENT

దీంతో బాక్సాఫీస్ వద్ద మెగా హీరోల ఆధిపత్యానికి బ్రేక్ పడిందన్న నానుడి ట్రేడ్ వర్గాల్లో వ్యక్తమవుతోంది. నితిన్ వంటి హీరోలు కూడా 50 కోట్ల క్లబ్ లో అవలీలగా చేరుతున్న నేపధ్యంలో… మెగా హీరోల కధల ఎంపిక విషయంలో మార్పు రావాల్సిన సమయం ఆసన్నమైందని, కేవలం ‘మాస్’ మంత్రమే జపిస్తే… మరో ‘బ్రూస్ లీ, సర్ధార్ గబ్బర్ సింగ్’ వంటి ఫలితాలే ఎదురుకావచ్చని సినీ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

గతంలో జూనియర్ ఎన్టీఆర్ కూడా అలాగే ఆలోచించి తీవ్ర పరాభవాలను చవిచూసారని, మారిన ఎన్టీఆర్ మాదిరే మెగా హీరోలు కూడా తమ వైఖరి మార్చుకోకుంటే, ‘మాస్ మాస్’ అంటూ జపించిన జూనియర్ కు గతంలో ఎదురైన అనుభవాలే ఎదురవుతాయన్న హెచ్చరికలు కూడా వస్తున్నాయి. ఏది ఏమైనా ‘జనతా గ్యారేజ్’ కలెక్షన్ల ప్రభంజనంతో టాలీవుడ్ లో లెక్కలు తారుమారవుతున్నాయన్న మాట వాస్తవం.

ADVERTISEMENT
Latest Stories