సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్, మెహ్రీన్ నటించిన జవాన్ సినిమా విడుదలకు సిద్ధం అయ్యింది. డిసెంబర్ 1 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రచారాన్ని ముమ్మరం చేసింది. మరోపక్క సినిమా సక్సెస్ మీద చిత్ర యూనిట్ కు చాలా నమ్మకం ఉన్నట్టు తెలుస్తుంది.
విడుదలకు ముందు రోజు సాయంత్రం సినిమా ప్రీమియర్ షో వెయ్యబోతున్నారు. నవంబర్ 30న హైదరాబాద్ శ్రీరాములు థియేటర్ లో ప్రీమియర్ షో జరగబోతుంది. చిత్ర యూనిట్ కూడా ప్రేక్షకులతో పాటు చిత్రం చూడబోతున్నారు. మాములుగా సినిమా బాగోకపోతే అమెరికాలో పడే ప్రీమియర్ షోల టాక్ గురించే భయపడుతూ ఉంటారు.
అలాంటిది అన్ని గంటల ముందే సినిమా చుపిస్తున్నారంటే వారి చిత్రం పై వారికి ఉన్న నమ్మకాన్ని సూచిస్తుంది. గతంలో వాంటెడ్ సినిమాను డైరెక్ట్ చేసిన మచ్చ రవి ఈ చిత్రానికి డైరెక్ట్ చేసారు. వరుస ప్లాపులతో సతమతం అవుతున్న సాయి ధరమ్ తేజ్ కు ఈ చిత్రం సక్సెస్ చాలా ముఖ్యం అనే చెప్పుకోవాలి.



