చంద్రబాబు ప్రధాని అంట… మరో సంచలన వ్యాఖ్య..!

JC diwakar Reddy says chandrababu naidu will 2019 Prime Ministerసంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ జేసీ దివాకర్ రెడ్డి. ఉన్నది ఉన్నట్లు తన అభిప్రాయాలను కుండ బద్దలు కొట్టినట్లు చెప్పే జేసీ తాజాగా వర్తమాన రాజకీయాలపై తనదైన రీతిలో స్పందించారు. రాష్ట్రంలో, దేశంలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయని అన్నారు. భవిష్యత్తు రాజకీయాలు అంచనాలకు అందని విధంగా ఉంటాయని, ‘ఏదైనా’ జరగవచ్చు అన్న సంకేతాలను వ్యక్తపరిచారు.

ప్రస్తుతం ప్రధానిగా నరేంద్ర మోడీ ఉన్నప్పటికీ, భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు ప్రధానిగా బాధ్యతలు చేపట్టినా ఆశ్చర్యం లేదని సంచలన వ్యాఖ్యలు చేసారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చిల్లు పడిందని, ఇప్పుడా పార్టీ నీరంతా పోతున్న జలాశయంలా ఉందని, 2019లో ఎన్నికలు జరిగే నాటికి వైకాపాలో ఒక్క నేత కూడా ఉండడని జోస్యం చెప్పిన జేసీ, జగన్ వైఖరి నచ్చకనే నేతలు పార్టీ మారుతున్నారని, జగన్ మారకుంటే తీవ్రంగా నష్టపోవాల్సి వుంటుందని హెచ్చరించారు.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories