కూటమి ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలి అంటూ టీడీపీ ని టార్గెట్ చేస్తూ జగన్ చేస్తున్న రాజకీయ డిమాండ్ కు ఊహించని మరో షాక్ ఎదురయ్యింది. ఇప్పటికే చెల్లి షర్మిల కాంగ్రెస్ పార్టీ నుండి అన్నను హడలెత్తిస్తోంది. ఇప్పుడు టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి జగన్ తల్లి విజయలక్ష్మిని ఆమె నివాసంలో కలిసి ముచ్చటించారు.
గత వైసీపీ ప్రభుత్వంలో జగన్ వ్యహారంతో జేసీ కుటుంబం తీవ్ర రాజకీయ, ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంది. అలాగే 2024 ఎన్నికలలో జగన్ ను కాదని షర్మిలలకు మెదడు పలికి కాంగ్రెస్ గెలుపు కోసం వీడియో సందేశం పంపించి వైసీపీకి శత్రువయ్యారు విజయలక్ష్మి.
వైసీపీ ఓటమికి విజయలక్ష్మి వీడియో సందేశం కూడా ఒక కారణముగా భావించిన జగన్ అవసరమైం మేరకే తల్లి విజయలక్ష్మిని మీడియా ముందుకు తీసుకువస్తున్నారు. ఈ నేపథ్యంలో జేసీ, విజయలక్ష్మిని కలవడంతో వీరిద్దరి భేటీతో ఏపీ రాజకీయాలు మారే అవకాశం ఉంటుందా అనే చర్చ ఊపందుకుంది.
అవినాష్ రెడ్డి పై వివేకా హత్య ఆరోపణలు మొదలైన నాటి నుండి జగన్ కుటుంబంలో విభేదాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. 2019 ఎన్నికల ఫలితాల తరువాత వైసీపీ అధికారాన్ని చేపట్టి జగన్ ముఖ్యమంత్రి అయిన నాటి నుండి షర్మిలకు జగన్ కు మధ్య సంబంధాలు తగ్గుతూ వచ్చాయి.
వైస్ కుటుంబంలో అన్నా చెల్లెళ్ళ మధ్య మొదలైన గ్యాప్ కు ఆర్థిక కారణాలతో పాటు రాజకీయ కారణాలు కూడా ఉన్నాయంటూ నర్మగర్భంగా షర్మిల వర్గం బయటపెట్టింది. వివేకా హత్యతో మొదలైన ఈ కుటుంబం రాజకీయాలు ఒక్కో మలుపు తిరుగు తెలంగాణ వరకు వెళ్లి తిరిగి ఏపీకి చేరాయి.
అయితే ప్రతి విషయంలోనూ షర్మిలకు తన మద్దతు తెలియజేస్తున్న విజయలక్ష్మి నేడు టీడీపీ నేతను కలవడం వైసీపీ కి సంజాయిషీ చెప్పుకోవాల్సిన స్థితిని తీసుకువస్తుంది. ఏ విషయాన్నైనా చంద్రబాబుతో ముడి పెట్టి రాజకీయం చేయడం అలవాటైన జగన్ కు ఇది కూడా బాబు స్కెచ్ లో భాగమే అంటూ నింద బాబు మీద నెట్టి తానూ పక్కకు తప్పుకుంటారా? జగన్ శత్రువులే తల్లి, చెల్లికి మిత్రులవ్వడానికి సాక్షి వైసీపీ నే అవుతుందేమో.




