ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే విశాఖ, రాజమండ్రి, గన్నవరం (విజయవాడ), ఓర్వకల్లు(కడప), రేణిగుంట (తిరుపతి)లో కలిపి ఆరు విమానాశ్రయాలు ఉన్నాయి.
విశాఖ నగరానికి సమీపంలో భోగాపురం వద్ద అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. అది అందుబాటులోకి రాగానే ప్రస్తుతం విశాఖ విమానాశ్రయాన్ని ఇండియన్ నేవీకి పూర్తిగా అప్పజెప్పేస్తారు. ఇవి కాక కొత్తగా మరో ఏడు విమానాశ్రయాలు ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దం అవుతోంది.
Also Read – కాళేశ్వరం సమస్యలు, పరిష్కారాలు.. అన్నీ ఆయనే!
శ్రీకాకుళం, తుని-అన్నవరం మద్య ఒకటి, తాడేపల్లి గూడెం, ఒంగోలు, నాగార్జున సాగర్, కుప్పం వద్ద విమానాశ్రయాలు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు ప్రారంభించింది.
ఇప్పటికే శ్రీకాకుళం జిల్లా దగదర్తి వద్ద 635 ఎకరాలు భూసేకరణ పూర్తయింది. మరో 650 ఎకరాలు సేకరించాల్సి ఉంది. మిగిలిన ప్రాంతాలలో కూడా విమానాశ్రయాల ఏర్పాటుకి ప్రభుత్వ భూములను గుర్తించి, అవసరమైతే ప్రైవేట్ భూములు సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Also Read – డబుల్ ఇంజన్ సర్కార్ అంటే ఇలా…
ఇప్పటికే ఏపీలో ఆరు విమానాశ్రయాలు ఉన్నప్పుడు మళ్ళీ కొత్తగా మరో ఏడు విమానాశ్రయాల అవసరం ఏమిటి? అనే సందేహం కలుగవచ్చు. వాటికి సమీపంలో బీపీసీఎల్, మిట్టల్ స్టీల్ ప్లాంట్, ఇంకా పలు భారీ, మద్యతరహా పరిశ్రమలు, ఐటి కంపెనీలు, ఫార్మా, డ్రోన్, ఐటి తదితర హబ్‌లు ఏర్పాటు కాబోతున్నాయి.
కనుక ఆయా ప్రాంతాలన్నీ శరవేగంగా అభివృద్ధి చెందుతాయని, అప్పుడు మరిన్ని విమానాయన సంస్థలు సర్వీసులు ప్రారంభం అవుతాయని ప్రభుత్వం భావిస్తోంది. కనుక ఇప్పటి నుంచే విమానాశ్రయాల ఏర్పాటుకి ప్రయత్నాలు మొదలుపెడితే ఆయా ప్రాంతాలు అభివృధ్ది చెందే సమయానికి అందుబాటులోకి తీసుకురావచ్చని సిఎం చంద్రబాబు నాయుడు చాలా దూరదృష్టితో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఐదేళ్ళు ఏపీని పాలించిన కుర్రాడు జగన్ భోగాపురానికి రెండోసారి శంకుస్థాపన చేయగలిగారు కానీ ఇటువంటి ఆలోచనలు చేయలేకపోయారు.
Also Read – పునర్నిర్మాణం కోసం ఒకరు…విస్తరణ కోసం మరొకరు..!
ప్రస్తుతం పౌరవిమానయాన శాఖ మంత్రిగా టీడీపీకి చెందిన రామ్మోహన్ నాయుడు ఉన్నారు. కనుక గట్టిగా ప్రయత్నిస్తే ఈ ఏడు విమానాశ్రయాల ఏర్పాటు చేయగలమని సిఎం చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు.
నేటికీ తెలంగాణ అంతటికీ ఓకే ఒక్క అంతర్జాతీయ విమానాశ్రయం శంషాబాద్ వద్ద ఉంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పటి నుంచే వరంగల్ వద్ద మరో విమానాశ్రయం ఏర్పాటు చేసేందుకు గతంలో కేసీఆర్ ప్రభుత్వం, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నిస్తూనే ఉన్నాయి. కానీ ఇంతవరకు ఏర్పాటు కాలేదు.
జెట్ స్పీడుతో సాగుతున్న సిఎం చంద్రబాబు నాయుడుని యువకుడైన తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి కూడా అందుకోలేకపోతున్నారు.
చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు ఫలించి ఏడు విమానాశ్రయాలు కూడా నిర్మించగలిగితే దేశంలో అత్యధిక (12) విమానాశ్రయాలున్న ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తుంది.