Jogi Ramesh at Mangalagiri Police Station

ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత కూడా వైసీపి నేతలు, వారి సొంత మీడియా, సోషల్ మీడియా రెచ్చిపోతుంటే సిఎం చంద్రబాబు నాయుడు వారిని ఉపేక్షిస్తున్నారు ఎప్పటిలాగే వారిపట్ల మెతక వైఖరి అవలంభిస్తున్నారని టిడిపి శ్రేణులు, మద్దతుదారులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Also Read – హైడ్రా ఎమ్మెల్యే వసంతపై పడిందేమిటో!

వారి అసహనం సిఎం చంద్రబాబు నాయుడు చెవిన పడిందో లేదో కానీ వైసీపికి కష్టాల సీజన్‌-1 మొదలైపోయింది.

ఇప్పటికే మాజీ మంత్రి జోగి రమేష్ కుమారుడు జోగి రాజీవ్‌పై అగ్రిగోల్డ్ భూముల విషయంలో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ మొదలుపెట్టారు.

Also Read – డ్రగ్స్ కేసులో షైన్ టామ్ చాకో అరెస్ట్‌.. మరోసారి డేంజర్ బెల్

చంద్రబాబు నాయుడు ఇంటిపై దాడికి ప్రయత్నించిన కేసులో జోగి రమేష్‌కి కూడా నోటీస్‌ అందడంతో ఆయన కూడా నేడు మంగళగిరి పోలీస్ స్టేషన్‌కు వచ్చి వివరణ ఇచ్చుకున్నారు. నాడు నేను చంద్రబాబు నాయుడునే పరిగెత్తిస్తా నన్ను ఎవరు అడ్డుకుంటారో రండని సవాలు విసురుతూ ఆయన ఇంటిపై రాళ్ళు వేయించారు.

కానీ జగన్‌పై అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలకు మనస్తాపం చెంది నిరసన తెలిపేందుకే చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళానని నేడు చెప్పారు. పోలీసులు ఆయనను సుమారు గంటసేపు ఆయనను ప్రశ్నించారు. ఈ కేసులో జోగి రమేష్‌ని అరెస్ట్ చేసే అవకాశం ఉంది.

Also Read – విజయశాంతి కోపం.. మరి సగటు ప్రేక్షకుడు?

మాజీ మంత్రి ఆర్‌కె రోజా, ధర్మాన కృష్ణదాస్ కోసం కూడా మరో కేసు సిద్దమవుతోంది. వారిరువురూ క్రీడల శాఖ మంత్రులుగా ఉన్నప్పుడు ‘ఆడుదాం ఆంద్రా’ పేరుతో జరిగిన క్రీడల పోటీలలో భారీగా నిధులు దుర్వినియోగం జరిగిందని, దానిపై విచారణ జరపాలని ఏపీ ప్రభుత్వం సీఐడీ పోలీసులను ఆదేశించింది.

ఈ మేరకు సీఐడీ పోలీసులు రోజా, ధర్మాన కృష్ణదాస్, శాప్ మాజీ ఛైర్మన్‌ బైరెడ్డి సిద్ధార్థ్ ముగ్గురిపై కేసు నమోదు చేయబోతున్నారు.

2021, అక్టోబర్ 19న మంగళగిరిలో టిడిపి కార్యాలయంపై దాడి కేసులో దేవినేని అవినాష్ రెడ్డి, సజ్జల రామకృష్ణా రెడ్డి, ఆళ్ళ రామకృష్ణా రెడ్డి, అప్పిరెడ్డి, అలశిల రఘులపై మంగళగిరి పోలీసులు కొన్ని రోజుల క్రితమే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

ఈ నేపధ్యంలో దేవినేని అవినాష్ రెడ్డి నిన్న రాత్రి రహస్యంగా శంషాబాద్ విమానాశ్రయం నుంచి దుబాయ్ పారిపోయేందుకు సిద్దమవగా పోలీసులు అడ్డుకుని వెనక్కు తిప్పి పంపారు. ఈ కేసులో కోర్టు అనుమతించే వరకు దేశం విడిచి బయటకు వెళ్ళరాదని మంగళగిరి పోలీసులు సూచించారు.

జగన్‌ స్వయంగా మంచి పిల్లోడని సర్టిఫై చేసిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌-డాన్సర్ దివ్వెల మాధురితో అక్రమ సంబంధం వలన పార్టీ ప్రతిష్టకు భంగం కలుగుతున్నందున పార్టీలో నుంచి సస్పెండ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

జగన్‌కు తాము చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం తప్పదని ముందే గ్రహించారు. అందుకే వైసీపిలో అందరూ 5 ఏళ్ళు కళ్ళు మూసుకోవాలని ముందే సూచించారు. పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ ఎవరూ తనని చూడలేదని భ్రమిస్తుంది. అలాగే వైసీపి నేతలని కూడా ఏమీ జరగడం లేదని భ్రమలో ఉండమని చెపుతున్నారేమో?

కానీ జగన్‌, వైసీపి నేతలు ఎంత గట్టిగా కళ్ళు మూసుకున్నా, టిడిపి కూటమి ప్రభుత్వం, పోలీసులు కళ్ళు మూసుకోరు. కనుక వారికి కష్టాలు సీజన్‌-1 మొదలైందనుకోవచ్చు.