జర్నలిజానికి స్వేచ్ఛ…పెన్నుకు స్వాతంత్య్రం…

pawan-kalyan-journalists

గత ఐదేళ్ల జగన్ పాలనలో అరాచకానికి స్వేచ్ఛ దొరికింది, అరాచక శక్తులకు స్వాతంత్య్రం లభించింది. అదే వైసీపీ ప్రభుత్వంలో పెన్నుకు షరతులు విధించారు, జర్నలిజానికి సంకెళ్లు వేశారు. నీలి మీడియా తప్ప మరో మీడియా గొంతెత్తలేని పరిస్థితులురాష్ట్రంలో నెలకొన్నాయి.

ADVERTISEMENT

అధికారంలో ఉన్న ఐదేళ్లు ఒక్క ప్రెస్ మీట్ కూడా నిర్వహించని జగన్ ప్రెస్ ను మాత్రం తన అధికారంతో బాగానే కట్టడి చేయగలిగారు. గతంలో ప్రజా సమస్యల పై ముఖ్యమంత్రిని ప్రశ్నించడం సరికాదుకదా కనీసం ప్రభుత్వానికి సూచనలు కూడా చెయ్యలేని నిస్సహాయ స్థితిలో నోటికి తాళం వేసుకుని కూర్చుంది జర్నలిజం.

నీలి మీడియా మాటున ప్రభుత్వాన్ని నడిపిన జగన్ ప్రజాభిప్రాయాన్ని వినిపించే గొంతులను పట్టించుకోలేదు. ఇప్పుడు దాని పర్యవసానాలు ఎదుర్కొంటు అధికారానికి దూరమయ్యారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఐదేళ్ల సంకెళ్లను రెక్కలొచ్చాయి, ఐదేళ్ల మౌన పోరాటానికి గొంతొచ్చింది.

ఇక అసలు విషయానికి వస్తే..,రాష్ట్రంలో తాజాగా జరుగుతున్న కేసులు, అరెస్టుల విషయమై పవన్ ను ప్రశ్నించిన మీడియా సంస్థలు మీ ప్రభుత్వ హయాంలో నడుస్తున్న పోలీస్ వ్యవస్థకు చిత్తశుద్ధి కొరవడిందా.? అంటూ మొదలుపెట్టి, కూటమి ప్రభుత్వంలో నమోదయిన కేసుల నుంచి విచారణకు హాజరు కాకుండా తప్పించుకు తిరుగుతున్న ఆర్జీవీ, ఇంకా అనేకమందిని పోలీసులు ఎందుకు అరెస్టు చేయలేకపోతున్నారు.?

గత వైసీపీ ప్రభుత్వం దేశ రాజధాని ఢిల్లీ లో ఉన్న వారిని సైతం గుట్టుగా అరెస్టు చేసి ఏపీకి తీసుకువచ్చి విచారించగలిగింది. అలాగే సొంత పార్టీ ఎంపీ RRR ను సైతం పొరుగు రాష్ట్రమైన హైద్రాబాద్ కు వచ్చి మరి అరెస్టు చేసి తీసుకెళ్లగలిగారు. కానీ మీ ప్రభుత్వంలో ఇది ఎందుకు సాధ్యం కావడం లేదు.?

మీ ప్రభుత్వం లో ఉండే హోమ్ వ్యవస్థ వారిని పట్టుకోలేకపోతుందా.? లేక వారు మీ పోలీసుల కళ్లుకప్పి పారిపోగలుగుతున్నారా.? బాబు మీద దాడికి యత్నించిన వారు సైతం రెండు రోజులలో బైలు మీద బయటకు వచ్చి కాలరెగరేస్తున్నారు. అలాగే మీ మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని సైతం అరెస్టు చేయలేకపోతున్నారు.? వై.?

అంటూ ఎటువంటి భయం, తడబాటు లేకుండా ఎంతో స్వేచ్ఛగా, స్వతంత్రంగా కూటమి ప్రభుత్వ పని తీరుని తప్పుబడుతూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగలిగారు. అదే వైసీపీ హయాంలో అయితే ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నిస్తే యెల్లో మీడియా అంటూ ముద్రేసి, సదరు మీడియా విలేకరులను సైతం అవమానించి పంపే వారు వైసీపీ నేతలు.

కానీ మీడియా తమ ప్రభుత్వ విధానాలను ప్రశ్నించినప్పటికీ పవన్ దానికి ఇది నా శాఖకు సంబంధించిన విషయం కాదు, కానీ మీరు నన్ను ఢిల్లీ వేదికగా నిలదీసిన సంగతి ముఖ్యమంత్రి బాబు తో పాటు హోమ్ శాఖ మంత్రి అనిత గారితోను చర్చిస్తా, వారికి ఈ సమాచారం చేరవేస్తా అంటూ నవ్వుతూనే బదులిచ్చారు.

ప్రశ్నించడం, ప్రజా గొంతు ప్రభుత్వానికి వినిపించడం మీడియా బాధ్యత. దానికి సమాధానం చెప్పడం ప్రభుత్వ విధి. దీనిని కూటమి ప్రభుత్వం ఆచరించి చూపించడం మంచి పరిణామం. దీనితో ఇక ఏపీలో జర్నలిజానికి స్వేచ్ఛ వచ్చింది…పెన్నుకు స్వాతంత్య్రం దక్కింది అంటున్నారు ప్రజాస్వామ్య వాదులు.

అలాకాకుండా ప్రశ్నించిన వారి పై అధికారమనే ఇనుపసంకెళ్లు తొడిగి అణిచివేయాలను కోవడం, జర్నిలిజాన్ని ఒక రంగుకి పరిమితం చేసి కట్టడి చేయాలనుకోవడం ప్రభుత్వాలను నడిపే రాజకీయ పార్టీలకు తగదు అని జగన్ ఇప్పటికైనా గ్రహించాలి. ముఖ్యమంత్రిగా బాబు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ మీడియా అడిగిన ప్రశ్నలకు ఎంతో బాధ్యతగా బదులిస్తూ జర్నలిజాన్ని గౌరవిస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories