ఒక సినిమా హిట్ అయ్యింది అంటే, ఆ సినిమా గురించి సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తుంది. అదే క్రమంలో ఒక సినిమా ఫ్లాప్ అయ్యింది అంటే ఆ సినిమాపై ట్రోలింగ్ ఒక రేంజ్ లో ఊపు అందుకుంటుంది. ఈ మధ్య కాలంలో ట్రోలింగ్ భారిన పడి కుదేలైపోయిన సినిమాల్లో మన చెర్రీ వినయ విధేయ రామ ఒకటి. మరో పక్క ఈ సినిమాతో పాటు విడుదల అయిన మిగిలిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి నోట్ తీసుకున్నాయి.
ఇక ఈ కోవలో ఎన్ఠీఆర్ బయోపిక్ విషయమే తీసుకుంటే “ఆపరేషన్ సక్సెస్ కానీ పేషెంట్ డైడ్” అన్న మాట బలంగా వినిపిస్తుంది. సినిమా బ్రహ్మాండంగా ఉంది అంటూనే, మరో పక్క సినిమా చూడడానికి ఇష్టపడడం లేదు ప్రేక్షకులు మరి అదేం లెక్కో తెలీదు.
అయితే ఈ సినిమా రిలీజ్ అయిన రోజు నుంచి ఈరోజు వరకూ చాల మంది సెలెబ్రేటిస్ ఈ సినిమాపై తమ మనుసులోను మాటలు సోషల్ మీడియాలో పంచుకున్నారు. కానీ తాత నా ప్రాణం అనే తారక్ మాత్రం అసలు ఈ సినిమా చూశాడో లేదో తెలీదు? చూసినా ఎక్కడా స్పందించలేదు. ప్రిన్స్ మహేష్ బాబు కూడా ఈ సినిమాపై స్పదించాడు. కానీ ఎన్ఠీఆర్ మాత్రం మౌనం వహిస్తున్నాడు.
ఇక మన జక్కన్న కూడా చిన్న చితకా సినిమాలు చూసి స్పదించే జక్కన్న, అసలు ఎన్ఠీఆర్ సినిమా గురించి స్పందించక పోవడం షాకింగ్ అనే చెప్పాలి. బహుశా ఈ ఇద్దరు తమ కొత్త సినిమా ‘ఆర్.ఆర్.ఆర్’లో బిజీగా ఉన్నారు అని సరిపెట్టుకోవాల్సిందే.



