జూనియర్ డుమ్మా… ఎన్టీ రామారావు రెండు ప్రముఖ కార్యక్రమాలకు!

Jr-NTR-Sr-NTRలెజెండరీ ఎన్టీ రామారావు శతజయంతి వేళ ఆయన చిత్రంతో ప్రత్యేకమైన రూ.100 నాణెం తీసుకురానున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నాణెం ఆవిష్కరణ కార్యక్రమం ఆగస్టు 28వ తేదీన రాష్ట్రపతి భవన్ లో జరగనుంది. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ కుటుంబసభ్యులతో పాటు 100 మందిని ఆహ్వానించారు.

అయితే ఎన్టీఆర్ మనవడు జూనియర్ ఎన్టీఆర్ ఈ కార్యక్రమానికి హాజరు కావడం లేదు. ఆ సమయంలో ఆయన హైదరాబాద్ లో దేవర షూటింగ్ లో బిజీగా ఉంటారని సమాచారం. 

ADVERTISEMENT

అయితే ఎన్టీ రామారావు కు సంబంధించిన ఇంతటి గొప్ప కార్యక్రమానికి జూనియర్ స్కిప్ చెయ్యడం పెద్ద ఎత్తున డిస్కషన్ నడుస్తుంది. 

మొన్న ఆ మధ్య ఎన్టీ రామారావు శతజయంతి ఉత్సవ సభ హైదరాబాద్ లో పెద్ద ఎత్తున జరిగింది. సినిమా ఇండస్ట్రీ నుండి చాలా మంది తారలు వచ్చి ఆయన గురించి గొప్పగా మాట్లాడారు. బాలయ్య తో విబేధాలు ఉన్నా నాగ చైతన్య ని పంపించారు నాగార్జున. 

అయితే తన పుట్టినరోజు విదేశాల్లో ఫ్రెండ్స్ తో జరుపుకోవడం తో రాలేను అని జూనియర్ నిర్వాహకులకు చెప్పారట.
సరే టీడీపీ కి సంబంధించిన కార్యక్రమం కావడం తో రాజకీయాలకు దూరంగా ఉండాలని ఆలోచన తో దూరంగా ఉన్నారు అనుకోవచ్చు.

అయితే ఈ కార్యక్రమం పూర్తిగా వేరు. పురందేశ్వరి అద్వర్యం లో నడిచింది మొత్తం. పైగా ఈ కార్యక్రమం జరుగుతుంది రాష్ట్రపతి భవన్ లో…. పైగా అధికారక కార్యక్రమం, అధికారిక ఆహ్వానం. 

దీనిని కూడా స్కిప్ చెయ్యడం చూసేవాళ్లకు బాగోదు. మరి జూనియర్ ఆలోచన ఏంటో!

ఏది ఏమైనా… తమ వంశం లోని ప్రతి ఒక్కరికి జీవితాన్ని ఇచ్చిన ఎన్టీ రామారావు కు సంబంధించిన రెండు ప్రముఖ కార్యక్రమాలకు జూనియర్ వెళ్లలేకపోవడం గమనార్హం… బాధాకరం.

ADVERTISEMENT
Latest Stories