రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపిన ప్రణయ్ హత్య కేసులో నేడు న్యాయస్థానం కీలక తీర్పును వెల్లడించింది. 2018 సెప్టెంబర్ 14 న మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ హత్య రెండు కుటుంబాలలో తీరని విషాదాన్ని, అలాగే ఇద్దరి జీవితాలలో జీవితకాల దుఃఖాన్ని మిగిల్చింది.
అమృత, ప్రణయ్ ల ప్రేమ వివాహం, ప్రణయ్ పరువు హత్య, ఆ పై అమృత తండ్రి మారుతీరావు ఆత్మహత్య ఇలా ఈ వివాదం మొత్తం విషాదంతోనే ముగిసింది. అయితే ఈ విషయంలో అటు అమృత తండ్రి మారుతీరావు చేసిన అనాలోచిత నిర్ణయం, క్షణికావేశం రెండు కలిపి రెండు నిండు జీవితాలను వారి సొంతవారి నుండి దూరమయ్యేలా చేసాయి.
అమృత…ప్రణయ్ ల కులాంతర వివాహానికి అభ్యంతరం తెలిపిన అమృత తండ్రి మారుతీరావు ప్రణయ్ పై ద్వేషం తో అమృత నిండు గర్భిణిగా గా ఉన్న సమయంలో అతని పై సుపారీ హత్యకు పాల్పడ్డారు. తన భార్య అమృత కళ్ళ ఎదుటే ప్రణయ్ ను అత్యంత పాశవికంగా నరికి చంపారు దుండగులు.
ఈ పరువు హత్యలో భాగంగా జరిగిన దారుణానికి నేడు కోర్ట్ నిందితులకు శిక్ష విధించింది. అయితే ఈ కేసులో A1 గా ఉన్న అమృత తండ్రి మారుతీరావు 2020 లో ఓ హోటల్ గదిలో ఆత్మహత్య చేసుకుని మరణించారు. అయితే అప్పట్లో ఈ పరువు హత్య రెండు తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్ అయ్యింది.
అయితే ఇప్పుడు ఈ కేసులో A2 సుభాష్ శర్మ కు ఉరి శిక్ష, A3 అస్గర్ అలీ, A4 అబ్దుల్ భారీ, A5 అబ్దుల కరీం, A6 శ్రావణ్ (మారుతీరావు సోదరుడు) A7 శివ లకు జీవిత ఖైదు విధిస్తూ నల్గొండ ఎస్సి, ఎస్టీ కోర్ట్ తీర్పు వెల్లించింది. దీనితో ఇన్నేళ్ల అమృత ఆవేదనకు, ప్రణయ్ కుటుంబ మానసిక క్షోభకు మనశ్శాంతి కలిగినట్లయ్యింది.




