బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కాజోల్ ముంబైలోని ఓ మాల్ లో కాలు జారి పడిపోయింది. ఫినిక్స్ మార్కెట్ సిటీ మాల్లో హెల్త్ అండ్ గ్లో స్టోర్ వద్ద ఏర్పాటు చేసిన
కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్ళిన సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. మోకాలు పొడవు ఉన్న తెల్లటి డ్రెస్ తో ఈ కార్యక్రమానికి హాజరైన కాజోల్, ఎస్కలేటర్ దిగి ఫ్లోర్ లో నడుస్తున్న సమయంలో, మరొక మహిళతో మాట్లాడుతూ కాజోల్ ఉన్నట్టుండి వెనక్కు పడిపోయింది.
బాడీగార్డు సాయంతో తిరిగి పైకి లేవగా, ఈ ఘటనలో ఆమెకు ఎటువంటి గాయాలు కాలేదు. ఈ ఘటనను ఎవరో వీడియో తీసి సామాజిక మాధ్యమంలో పెట్టేశారు. దీంతో మీడియా వర్గాలు కూడా దీనిని ప్రసారం చేసాయి. 2015లో ‘దిల్ వాలే’ సినిమా ట్రైలర్ విడుదల సమయంలోనూ కాజోల్ ఇదే విధంగా కాలు జారి పడిపోతున్న క్రమంలో సహ నటుడు వరుణ్ ధావన్ రెండు చేతులతో పట్టుకుని కాపాడిన విషయం తెలిసిందే.
Also Read – జగన్ తరిమేస్తే చంద్రబాబు మళ్ళీ తెస్తున్నారు
Also Read – మీరు కోరుకుంటే ఎన్నికలు రావు.. కాస్త ఓపిక పట్టండి!