kakani-govardhan-reddy on Chandrababu Davos Tour

వైసీపీలో ఎవరి మీదైనా కేసు నమోదు అయితే వారు వెంటనే సొంత మీడియా ముందుకు వచ్చి సిఎం చంద్రబాబు నాయుడుని విమర్శిస్తుంటారు. ఆ కేసు గురించే మాట్లాడితే జనాలు దానిని సరిగా రిసీవ్ చేసుకోరు. కనుక ఓ తాజా టాపిక్ ఎంచుకొని దాని గురించి ఓ రెండు ముక్కలు మాట్లాడి తర్వాత తమ కేసు గురించి మాట్లాడుతుంటారు.

మాజీ మంత్రి కాకాణీ గోవర్ధన్ రెడ్డి మీద కూడా ఓ కేసు నమోదైంది. కనుక సొంత మీడియా ముందుకు వచ్చేశారు. ఆయన ఎంచుకున్న టాపిక్ సిఎం చంద్రబాబు నాయుడు దావోస్‌ పర్యటన.. ఆ సదస్సులో హైదరాబాద్‌ కంపెనీతో ఒప్పందం చేసుకోవడం.

Also Read – సజ్జల లేని లోటు కనిపిస్తోందా.. మావయ్యా?

“విజయవాడ పక్కనే ఉన్న హైదరాబాద్‌లో ఉన్న కంపెనీతో ఒప్పందం చేసుకోవడానికి చంద్రబాబు నాయుడు దావోస్‌ వెళ్ళాలా? వాళ్ళనే విజయవాడ రమ్మంటే రారా? చంద్రబాబు నాయుడు దావోస్‌ వెళ్ళి ఏదో సాధించేస్తున్నారని ప్రజలను మభ్యపెట్టడానికే ఈ ప్రయత్నం. దీని కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రచారం కూడా చేసుకుంటున్నారు,” అని కాకాణీ గోవర్ధన్ రెడ్డి విమర్శించారు.

నిజమే! హైదరాబాద్‌లో ఉన్న కంపెనీతో ఒప్పందం కోసం దావోస్‌ వెళ్ళనవసరం లేదు. కానీ భారత్‌తో సహా 18 దేశాల నుంచి కంపెనీల ప్రతినిధులు తమ వ్యాపార కార్యకలాపాలను ఇతర దేశాలు, ఇతర రాష్ట్రాలకు విస్తరించుకునే ప్రయత్నంలో ఈ సదస్సుకి హాజరవుతుంటారు.

Also Read – చంద్రబాబు నాయుడు విధానాలే కరెక్ట్?

అలా గుజరాత్, మహారాష్ట్ర, తెలంగాణ తదితర రాష్ట్రాల నుంచి వచ్చిన పారిశ్రామికవేత్తలని దావోస్‌ సదస్సులో కలవకూడదని, వారితో ఏపీలో పెట్టుబడులు పెట్టించకూడదని ఎక్కడా లేదు కదా?

జగన్‌ ఒకే ఒక్కసారి దావోస్‌ వెళ్ళినప్పుడు అక్కడే గౌతం అదానీని కలిశారు కదా? ఆయనతో రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టించారని, దానినే చంద్రబాబు నాయుడు తనవిగా చెప్పుకుంటున్నారని వైసీపీ సోషల్ మీడియాలోనే చెప్పుకుంటోంది కదా?

Also Read – సిఎం కంటే మంత్రులకే మంచి ర్యాంక్స్… భళా!

జగన్‌ ప్రత్యేక విమానం వేసుకొని దావోస్‌ సదస్సుకి వెళ్ళివచ్చి ఏం సాధించారో వైసీపీ నేతలు చెప్పలేరు. కానీ చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌ దావోస్‌ సదస్సులో పాల్గొంటుంటే అసూయతో రగిలిపోతున్నారు. వారు దావోస్‌ సదస్సుకి వెళ్ళారు తప్ప పిక్నిక్ కాదు. రాష్ట్రానికి పెట్టుబడులు సాధించేందుకు వారు కృషి చేస్తుంటే దానికీ ఏడుపేనా?




అయినా మీ యువ అధినేత జగన్‌ లండన్‌లో సేదతీరుతుంటే, 74 ఏళ్ళ వృద్ధుడు సిఎం చంద్రబాబు నాయుడు దావోస్‌ సదస్సులో పాల్గొని రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు తెచ్చేందుకు ప్రయత్నిస్తుంటే ఇలా మాట్లాడటానికి సిగ్గు అనిపించడం లేదా కాకాణిగారు?