kavitha in kerala liquor scam

ఓటమి భారం నుంచి ఇప్పుడిప్పుడే బయట పడుతున్న బిఆర్ఎస్ పార్టీకి మరో గండం పొంచివున్నట్టు కేరళలో సంకేతాలు వినిపిస్తున్నాయి. అసలు విషయానికి వస్తే ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ, కేసీఆర్ కుమార్తె కవిత చాల కీలక పాత్ర పోషించారంటూ ఆమె మీద అవినీతి ఆరోపణలు రావడం అందుకుగాను ఆమె దాదాపు ఆరు మాసాల పాటు తీహార్ జైల్లో దోషిగా శిక్ష అనుభవించడం ఇక అటు పిమ్మట బైలు మీద విడుదలవడం తెలిసిందే.

అయితే అయితే కవిత మీద వచ్చిన లిక్కర్ ఆరోపణలు బిఆర్ఎస్ పార్టీని నైతికంగా కుంగదీసిందనే చెప్పాలి. ఇప్పుడిప్పుడే ఆ గాయాల నుంచి తేరుకుంటూ ప్రజా పోరాటంలోకి అడుగుపెడుతున్న బిఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు కేరళ లిక్కర్ కేసులో కవిత పాత్ర అంటూ మరోమారు కవిత మీద ఆరోపణలు రావడం ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బగానే భావించాలి.

Also Read – అయ్యో ‘నానీ’లు ఇలా అయిపోయారే..!

కేరళ లిక్కర్ స్కాములో కూడా కవిత పాత్ర ఉందంటూ వస్తున్న ఆరోపణలు మీద స్పందించిన తెలంగాణ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ‘కేరళ లో కూడా మన కీర్తి పతాకం ఎగిరినట్టుంది’ అంటూ తన సోషల్ మీడియాలో కవితను ఉద్దేశించి ఒక సెటైరికల్ పోస్ట్ చేసారు.

ఒక మహిళా నేతగా ఉంటూ అందునా పార్టీ అధినేత కుమార్తెగా, ఒక ఉద్యమ నాయకుడి వారసురాలిగా రాజకీయ ఎంట్రీ ఇచ్చిన కవిత ఇలా లిక్కర్ కేసుల స్కాం లో పలు రాష్ట్రాలలో ఆరోపణలు ఎదుర్కోవడం నిజంగా కేసీఆర్ కు తలవంపులుగా మారింది. ఇటు పక్క కొడుకు కేటీఆర్ ఫోన్ టాపింగ్ లో ఆరోపణలు ఎదుర్కొంటు తాజాగా ఈ ఫార్ములా రేసులో అధికారుల ముందుకు విచారణకు హాజరయ్యారు.

Also Read – ట్రంప్‌-మోడీ భేటీ ఎవరిది పైచేయి?

ఇలా కూతురు కవిత లిక్కర్ మాఫియా క్వీన్ గా, కొడుకు కేటీఆర్ మనీ మాఫియా కింగ్ గా గత పదేళ్లు తమ కుటుంబాన్ని బంగారు మయం చేసుకున్నారు అంటూ బీజేపీ, కాంగ్రెస్ శ్రేణులు బిఆర్ఎస్ పార్టీ మీద, పార్టీ అధినేత కేసీఆర్ మీద విరుచుకుపడుతున్నారు. అయితే ఈసారి కేసీఆర్ మౌనం బిఆర్ఎస్ పార్టీకే కాదు కవిత రాజకీయ భవిష్యత్ కూడా ప్రమాదకరం.




దీనితో ఈసారి తెలంగాణ వాయుగుండం కేరళను తాకినట్టే అంటున్నారు ప్రత్యర్థి పార్టీల నేతలు. మరి ఈ కవిత లిక్కర్ వాయుగుండం తీరాన్ని దాటి తెలంగాణలో తుఫాన్ మాదిరి విధ్వంసాన్ని సృష్టిస్తుందా లేక అల్పపీడనంగా మారి సద్దుమణుగుతుందా.?

Also Read – మోడీ “లీగల్లీ కన్వర్టర్ బీసీ”..?