kavitha-Kalvakuntla

గడిచిన నాలుగు నెలల నుంచి బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కేసీఆర్ కుమార్తె కవిత ఢిల్లీ లిక్కర్ స్కాములో అరెస్టయ్యి తీహార్ జైల్లో బెయిలు కోసం నిరీక్షిస్తున్నారు. అయితే బెయిలు కోసం కవిత కుటుంబ సభ్యులు ఎంతలా ప్రయత్నించినా ఆమెకు జైలు జీవితం నుండి ఉపశమనం మాత్రం దక్కడం లేదు.

Also Read – అయ్యో పాపం… వాలంటీర్లు!

ఈ వారంలో కవిత బయటకొస్తారు, ఈ ఎన్నికలు పూర్తయ్యే సరికి కవిత కడిగిన ముత్యం వలె జైలు నుండి బయటపడతారు అంటూ బిఆర్ఎస్ నాయకులు, కవిత కుటుంబసభ్యులు కేటీఆర్, హరీష్ రావు చెపుతున్నప్పటికీ కవితకు మాత్రం న్యాయస్థానాల నుండి ఊరట లభించడం లేదు.

కవిత బెయిలు మీద బయటకు వెళ్ళితే కేసులోని సాక్ష్యులను, సాక్ష్యాలను ప్రభావితం చేసి కేసును మళ్ళీ మొదటికి తెచ్చే ప్రమాదముంది అంటూ అధికారులు న్యాయస్థానికి తమ వాదనలు వినిపించి మెప్పించడంతో ఎప్పటికప్పుడు కవిత ఆశలు అడియాశలుగానే మిగిలిపోతున్నాయి.

Also Read – ఐదేళ్ళ వైఫల్యం 100 రోజుల సమర్ధతని ప్రశ్నిస్తోంది!

ఈ నేపథ్యంలో అసలు కవిత ఇప్పట్లో కేసుల నుండి కనీసం బెయిలు మీదనైనా బయటపడతారా అనుకుంటున్న తరుణంలో కవితకు అస్వస్థత, ఆసుపత్రికి తరలించారు అనే వార్త ఒక రకంగా కవిత కుటుంబ సభ్యులను కంగారు పెట్టినప్పటికీ మరోపక్క కాస్త ఊరటను అందించిందని చెప్పాలి.

కవిత ఆరోగ్య పరిస్థితి సరిగాలేదని, ఆమెకు ఈ సమయంలో ఇంటి వాతావరణమే అవసరమని, కవిత ఆరోగ్య సమస్యల దృష్ట్యా మానవతా కోణంలో కవితకు న్యాయస్థానాలు బెయిలు ఇవ్వాలని అంటూ ఆమె తరుపు న్యాయవాదులు కోర్టులను ఆశ్రయించే అవకాశం లేకపోలేదు.

Also Read – జగన్ ను నమ్మితే ‘భవిష్యత్’ గోవిందా..!

ఒక వేళ న్యాయమూర్తులు ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకుంటే కవితకు ఉపసమనం కల్పించవచ్చు అనే ఆశలో ఉన్నారు బిఆర్ఎస్ క్యాడర్. అయితే కవితకు జ్వరం రావడంతో జైలు అధికారులు ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించి ఆరోగ్యం కాస్త కుదుటపడగానే మళ్ళీ జైలుకు తరిలించేసారు.

మరి కవిత అనారోగ్యం బిఆర్ఎస్ పార్టీకి, ఆమె కుటుంబానికి ఉపిరిస్తుందో లేదో చూడాలి. ఇదిలా ఉంటే కవిత కేసును అడ్డుపెట్టుకుని బిఆర్ఎస్ నుండి పూర్తి రాజకీయ లబ్ది పొందడానికి బీజేపీ అన్ని విధాలా ప్రయత్నాలు కొనసాగిస్తుంది అంటూ తెలంగాణ రాజకీయాలలో ఊహాగానాలు బలంగా వినపడుతున్న నేపథ్యంలో కవిత కేసు ఎవరి పక్షాన మలుపు తిరగనుందో?