బ్రేకింగ్ : ‘విశ్వరూపం 2’ విడుదల కాబోతోందట!

kamal haasan, vishwaroopam 2, kamal haasan vishwaroopam 2 release, vishwaroopam 2 movie, vishwaroopam 2 producer, Aascar Ravichandranకమల్ హాసన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘విశ్వరూపం’ సినిమా ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. అనేక వివాదాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోవడం, ‘విశ్వరూపం 2’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మొదటి పార్ట్ షూటింగ్ లోనే రెండవ పార్ట్ కు సంబంధించిన కొంత భాగం షూటింగ్ జరుపుకోగా, ఆ తర్వాత అనేక ‘ట్విస్ట్’ల మధ్య మిగతా భాగం కూడా షూటింగ్ పూర్తి చేసుకుంది.

అయితే సినిమా మాత్రం విడుదల కాలేదు.దీంతో కమల్ అభిమానులతో పాటు, సినీ ప్రేక్షకులు కూడా ఈ సినిమా విడుదలపై ఎదురు చూపులు చూస్తున్నారు. గత రెండేళ్ళుగా అనేక మార్లు వాయిదాలు పడుతూ వస్తున్న ‘విశ్వరూపం 2’ విడుదలకు ఎట్టకేలకు ముహూర్తం ఖరారైనట్లుగా సినీ వర్గాల టాక్. తమిళులు అత్యంత ప్రియంగా ఇష్టపడే దీపావళి (అమావాస్య) నాడు విడుదల చేయాలని భావిస్తున్నారట.

ADVERTISEMENT

మరి ఈ సారైనా ప్రేక్షకుల ముందుకు వస్తుందో లేదో గానీ, ‘విశ్వరూపం 2’పై కమల్ అభిమానులు, సినీ ప్రేక్షకులు అంచనాలనే పెట్టుకున్నారు. ‘విశ్వరూపం’లో టెర్రరిజంపై కమల్ చూపించిన విధానం, ఈ తదుపరి పార్ట్ పై మరింత ఆసక్తిని పెంచింది. ముఖ్యంగా సినిమా చివరలో నెక్స్ట్ ఇండియాలోనే… అంటూ ముగించడంతో, కమల్ ఏ రేంజ్ లో తెరకేక్కించారో అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.

ADVERTISEMENT
Latest Stories