బీజేపీ కొత్త అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కామెంట్లను జీర్ణించుకోలేకపోతున్నారు. చంద్రబాబు కన్నా లక్ష్మీనారాయణను బీజేపీకి అద్దె మైకు, వైఎస్సాఆర్ కాంగ్రెస్ కు సొంత మైకు అన్న సంగతి తెలిసిందే. సహజంగానే చంద్రబాబు అంటే మండిపడే కన్నా దీనిపై ఘాటుగా స్పందించారు.
” చంద్రబాబు నాయుడు ఆంధ్ర అపరిచితుడి మాటలు నమ్మకండి. చంద్రబాబుది అన్నం పెట్టిన చేతిని నరికే సంస్కృతి. అనుభవం ఉన్న వ్యక్తి అని చంద్రబాబును ప్రజలు ముఖ్యమంత్రిని చేస్తే గజదొంగను మించిపోయారు. కాంగ్రెస్ పార్టీకి చంద్రబాబు అద్దె మైకు లాంటివారు,” అని కన్నా విమర్శించారు.
“చంద్రబాబు నిన్న చేసింది నవనిర్మాణ దీక్ష కాదు నయవంచన దీక్ష. మూడు దీక్షల్లో కాంగ్రెస్‌ను తప్పుబట్టిన చంద్రబాబు ఈ దీక్షలో తన నిజరూపాన్ని బయట పెట్టుకున్నారు. రాహుల్ గాందీ ప్రాపకం కోసం మోదీ, అమిత్ షాలను విమర్శిస్తున్నారు. నాలుగేళ్ల పాలనలో మోదీ అవినీతి రహిత పాలన సాగించి అందరికి ఆదర్శంగా నిలిచారు.” అని కన్నా చెప్పుకొచ్చారు.



