లైంగిక వేధింపులతో అరెస్ట్ అయిన సినీ నిర్మాత!

Kannada Producer Harassing Arrest - Veerash‘ప్రీతి మాయ హుషారు’ అనే కన్నడ సినిమాను నిర్మించిన నిర్మాత వీరేష్ కార్యాలయంలో ఓ యువతి పని చేస్తోంది. ఆమెకు హీరోయిన్ గా అవకాశం కల్పిస్తానంటూ, వీరేష్ లైంగికంగా వేధించడం మొదలుపెట్టాడు. తనకు పెద్ద నిర్మాతలతో కూడా పరిచయం ఉందని, తనకు సహకరిస్తే ఇండస్ట్రీలో పెద్ద హీరోయిన్ ను చేస్తానని, ఇలా మాయమాటలు చెప్పి, ప్రతి రోజు ఏదొక విధంగా లైంగిక వేధింపులకు పాల్పడేవాడు. దీంతో ఈ వేధింపులను భరించలేని సదరు యువతి, తన కుటుంబ సభ్యులకు అసలు విషయాన్ని తెలిపింది.

దీంతో రంగంలోకి దిగిన ఆమె కుటుంబ సభ్యులు, బెంగళూరులోని హెచ్ఎస్ఆర్ లేఔట్ లో ఉన్న వీరేష్ ఇంటికి వచ్చి, అతని వీపు విమానం మోత మోగించారు. అనంతరం సదరు నిర్మాతను పోలీసులకు అప్పగించగా, పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. సినీ పరిశ్రమలో ఇలాంటి మోసాలు సర్వసాధారణం కావడంతో, సదరు యువతి మాదిరే, మిగతావారు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచనలిస్తున్నారు పోలీసులు. అందులోనూ ఇటీవల కాలంలో ఎందరో హీరోయిన్లు ఇలాంటి తమ అనుభూతులను బహిరంగ పరుస్తున్న విషయం తెలిసిందే.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories