వచ్చే జరిగే నెలలో జరిగే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. దీనికి తోడు సర్వేలు కూడా ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం ఇవ్వడం లేదు. ఎన్జీ మైండ్‌ఫ్రేమ్ సంస్థ నిర్వహించిన సర్వేలో కాంగ్రెస్ పార్టీ 95–105 స్థానాలతో అతిపెద్ద పార్టీగా అవతరించనుందని తెలిపిందని మీడియాలో వార్తలు వచ్చాయి.
బీజేపీకి 75–85 సీట్లు, జేడీఎ స్‌కు 35–41 సీట్లు వచ్చే చాన్సుందని వెల్లడైంది. ఇతరులకు 4–8 సీట్లు రావొచ్చని అంచనా వేసింది. 224 నియోజకవర్గాల్లో ఒక్కో పోలింగ్ బూత్ నుంచి 25 మందితో శాంపుల్స్ సేకరించి సర్వే చేశారు. అయితే ఫలితాలు ఇలా వచ్చినా బీజేపీకే గవర్నమెంట్ ఏర్పాటు చెయ్యడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.
జేడీఎస్ కింగ్ మేకర్‌గా మారనుందని సర్వే వ్యాఖ్యానించింది. ఇప్పటికే బీజేపీ, జేడీఎస్ ఒక లోపాయకారి ఒప్పందంతో ముందుకు వెళ్తున్నాయి. ముంబై కర్ణాటక, సెంట్రల్ కర్ణాటకల్లో బీజేపీ ఎక్కువ సీట్లు సాధిస్తుందని మిగిలిన ప్రాంతాల్లో కాంగ్రెస్ మెజారిటీ స్థానాలు కైవసం చేసుకోవచ్చని సర్వేలో వెల్లడైంది



