తిరుపతి సభలో బీజేపీకి చంద్రబాబు మరో షాక్

Karumanchi Jayaram Joining TDPఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తిరుపతిలో అతి పెద్ద బహిరంగ సభ వేదిక పై నుంచి, ప్రధాని మోడీ ఆంధ్ర రాష్ట్రానికి చేసిన మోసం గురించి, ఎండగట్టనున్నారు. 2014లో ఎక్కడైతే ప్రత్యేక హోదా ఇస్తాం అని వాగ్దానం చేసి మాట తప్పారో సరిగ్గా అక్కడే అదే రోజున సభ పెడుతున్నారు చంద్రబాబు నాయుడు.

ADVERTISEMENT

సరిగ్గా అదే సమయంలో బీజేపీని రాజకీయంగా కూడా దెబ్బ కొట్టేప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు. 2014లో తిరుపతి నుంచి బీజేపీ తరఫున ఎంపీగా పోటీ చేసిన కారుమంచి జయరామ్‌ ఆ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను నిన్న సాయంత్రం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాకు ఫ్యాక్స్‌లో పంపారు.

రేపు తిరుపతిలో జరిగే ధర్మపోరాట దీక్ష బహిరంగ సభలో సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకొన్నారు. 2014లో పోలీస్‌ ఆఫీసర్‌ పదవికి రాజీనామా చేసి తిరుపతి లోక్‌సభ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే వైఎస్సాఆర్ కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో స్వల్పతేడాతో ఓడిపోయారు. ఈ చేరికతో బీజేపీని మరింత బలహీనం చేయగలిగారు చంద్రబాబు.

ADVERTISEMENT
Latest Stories