కత్తి మహేష్ అరెస్ట్!

Kathi Mahesh - arrestedఇటీవల ఓ న్యూస్ ఛానల్ లో జరిగిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్న కత్తి మహేష్, “రామాయణం అనేది ఒక కథ అని, రాముడనే వ్యక్తి ఎంత ఆదర్శవంతుడో, అంత దగుల్బాజీ అని కూడా తాను నమ్ముతానని, రావణుడితోనే సీత ఉంటే బాగుండేదేమోనని, ఆమెకు న్యాయం జరిగి ఉండేదని తాను భావిస్తున్నానని” వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో మండిపడిన హిందూ జనశక్తి నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కేసులు పెట్టారు.

కత్తి వ్యాఖ్యలతో తమ మనోభావాలు దెబ్బతిన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో మహేశ్‌ను సోమవారం రాత్రి ఆయన ఇంటి వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మంగళవారం నాడు రిమాండ్‌కు తరలించనున్నారు. ఇదిలా ఉంటే కత్తిపై వివిధ స్టేషన్లలో మొత్తం నాలుగు కేసులు నమోదయ్యాయి. గత ఏడాది కాలంగా అనేక విషయాలలో వివాదాస్పద వ్యక్తిగా కత్తి మహేష్ నిలుస్తున్న విషయం తెలిసిందే.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories