kalvakuntla-kavitha

తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ నేతల నాలిక ఎప్పుడు మడత పెడతారో ఎవరూ చెప్పలేరు. టీడీపీ, దాని అధినేత చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్‌‌ రాజకీయ నాయకులు పట్ల అకారణ ద్వేషం ప్రదర్శించే బిఆర్ఎస్ పార్టీ నేతలు ఇప్పుడు చంద్రబాబు నాయుడుని చూసి నేర్చుకోమని తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డికి హితవు చెపుతుండటం ఆశ్చర్యం కలిగిస్తుంది.

సిఎం రేవంత్ రెడ్డి బృందం దావోస్‌ సదస్సు నుంచి తెలంగాణ రాష్ట్రానికి రూ. 1.78 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించుకువస్తే, బిఆర్ఎస్ పార్టీ నేతలు అందుకు ఆయనని అభినందించకపోగా ‘అంతా ఉత్తదే… ఏంవోయూలన్నీ పాతవే,” అంటూ కొట్టిపడేశారు.

Also Read – వ్యవస్థలకి జగన్‌ డ్యామేజ్… చంద్రబాబు రిపేర్స్!

కానీ చంద్రబాబు నాయుడు బృందం ఏపీకి ఒక్క రూపాయి కూడా పెట్టుబడి తేలేకపోయారని ఇక్కడ జగన్‌ బ్యాచ్ అవహేళన చేస్తుంటే, ‘చంద్రబాబు నాయుడుని చూసి నేర్చుకో రేవంత్ రెడ్డి’ అని బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హితవు చెపుతుండటం విశేషం.

తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నేడు నీళ్ళు-నిజాలు పేరుతో రౌండ్ టేబిల్ సమావేశంలో కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ, “కేసీఆర్‌ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి తెలంగాణలో కోటి ఎకరాలకు నీళ్ళు పారిస్తే, రేవంత్ రెడ్డి తన సొంత జిల్లాలో కూడా భూములను ఎండబెట్టేస్తున్నారు.

Also Read – అరెస్ట్‌ అయితే ముఖ్యమంత్రి కారన్న మాట!

కేసీఆర్‌ మీద కక్షతో కాళేశ్వరం ప్రాజెక్టుని దెబ్బ తీయాలనుకోవడం చాలా నీచమైన ఆలోచన. అదే.. పొరుగు రాష్ట్రం ఏపీలో చంద్రబాబు నాయుడు, జగన్‌ ఒకరు ప్రారంభించిన ప్రాజెక్టు పనులను మరొకరు కొనసాగిస్తూ తమ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటున్నారు. కానీ ఇక్కడ మన రాష్ట్రాన్ని మనమే దెబ్బ తీసుకుంటున్నాము,” అని అన్నారు.

అంతకు ముందు వేర్వేరు సందబాలలో హరీష్ రావు, కేటీఆర్‌ ఏమన్నారంటే “చంద్రబాబు నాయుడు, ఆయన ఎంపీలు ఢిల్లీ పెద్దలపై ఒత్తిడి చేసి వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణ కాకుండా నిలిపివేశారని, కానీ సిఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్‌, బీజేపి ఎంపీలు తెలంగాణ కోసం కేంద్రాన్ని నిలదీసి అడగడం లేదని విమర్శించారు.

Also Read – ఈ పైరసీల ఫాంటసీ ఏంటో..? దీనికి వాక్సిన్ లేదా.?

తమ పాలనలో తెలంగాణ రాష్ట్రం గొప్పగా అభివృద్ధి చెందిందని చెప్పుకోవడానికి దయనీయ పరిస్థితిలో ఉన్న ఏపీని చూపించి మాట్లాడిన్నట్లే, ఇప్పుడు తమ బద్ద శత్రువు రేవంత్ రెడ్డిని తక్కువ చేసి చూపేందుకే చంద్రబాబు నాయుడు ప్రస్తావన చేస్తున్నారు తప్ప నిజంగా ఆయన సాధిస్తున్నవి చూసి కాదు.

చంద్రబాబు నాయుడుపై కక్షతోనే జగన్‌ అమరావతి నిర్మాణం నిలిపివేశారని, ఆయన అమరావతి వద్దనుకుంటున్నారు కనుకనే తన తండ్రి కేసీఆర్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయ్యేందుకు సాయపడ్డారని ఆమెకు బాగా తెలుసు.

జగన్‌ అధికారంలోకి రాగానే పోలవరం నిర్మాణ పనులని కూడా రివర్స్ టెండరింగ్‌తో నిలిపివేశారని, చంద్రబాబు నాయుడుపై కక్షతో ప్రజావేదిక కూల్చేశారని, అన్నా క్యాంటీన్లు మూసేశారని కల్వకుంట్ల కవిత బాగా తెలుసు.




కానీ చంద్రబాబు నాయుడు, జగన్‌ ఇద్దరూ ఒకరి తర్వాత ఒకరు ప్రాజెక్టు నిర్మాణాలు కొనసాగిస్తున్నారని కల్వకుంట్ల కవిత చెప్పడం దేనికంటే, చంద్రబాబు నాయుడు ఒక్కరినే పొగిడేందుకు మనస్కరించకనే! అందుకే జగన్‌ పేరుని కూడా చేర్చారు.