
కేసీఆర్ చుట్టూ దెయ్యాలు, పార్టీలో కోవర్టులు తిరుగుతున్నారంటూ కల్వకుంట్ల కవిత అన్న మాటలతో ఇటు ఆమె, అటు బిఆర్ఎస్ పార్టీ కూడా ‘యూటర్న్’ తీసుకోలేని పాయింట్‌కు వచ్చేశారు.
అసలు ఆమె ఈవిదంగా ఎందుకు బరస్ట్ అయ్యారు?అని ఆలోచిస్తే, మద్యం కుంభకోణం కేసుతోనే ఇదంతా మొదలైనట్లు చెప్పవచ్చు.
Also Read – సంక్షేమ పధకాలతోనే వైసీపీని హైజాక్.. భలే ఉందే!
ఒకప్పుడు “దమ్ముంటే మా కవితమ్మని టచ్ చేసి చూడండి.. రాష్ట్రం అగ్నిగుండం అయిపోతుందని” ప్రధాని మోడీని హెచ్చరించిన కేసీఆరే, సీబీఐ అధికారులు హైదరాబాద్ వచ్చి ఆమె నివాసం నుంచే అరెస్ట్ చేసి ఢిల్లీకి పట్టుకుపోతుంటే, ఏమీ చేయలేక చేతులు ముడుచుకు కూర్చున్నారు.
ఆ తర్వాత ఆమె ఆరు నెలలు జైల్లో ఉంటే, కేసీఆర్, కేటీఆర్‌లతో సహా ఎవరూ ఆమెని పట్టించుకోకుండా రాష్ట్రంలో రాజకీయాలు చేసుకున్నారు.
Also Read – అమ్మ ఒడి..తల్లికి వందనం.బటన్ లేదా.?
ప్రధాని మోడీ తన తండ్రి కేసీఆర్‌ని రాజకీయంగా ఎదుర్కోలేక ఆ కక్షతోనే తనని అరెస్ట్ చేయించారని కల్వకుంట్ల కవిత పదేపదే చెప్పుకునేవారు. అంటే కేసీఆర్ జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలనే యావతో ప్రధాని మోడీపై కత్తులు దూయడం వల్లనే తనకు ఈ దుస్థితి కలిగిందని ఆమె చెపుతున్నట్లే అనుకోవచ్చు.
కానీ ఆ కేసులో అరెస్ట్ అవడం వలన ఆమెకు మాత్రమే కాదు.. కేసీఆర్‌కి తీరని అప్రదిష్టం, మానసిక క్షోభ తప్పలేదు. ఆమె వలన ఆయన తన జాతీయ కలలు త్యాగం చేయాల్సి వచ్చింది.
Also Read – యుద్ధం మద్యలో ఈ బేరాలేంటి ట్రంప్ గారు?
కనుక బెయిల్‌పై విడుదలై తిరిగి వచ్చిన తర్వాత ఆమెని రాజకీయాల నుంచి తప్పుకోమని కేసీఆర్ సూచించి ఉండవచ్చు.
కానీ అందుకు ఆమె అంగీకరించకుండా మళ్ళీ రాజకీయాలలో చురుకుగా పాల్గొనడం కేసీఆర్‌కు ఆగ్రహం కలిగించి ఉండవచ్చు. అందుకే ఆమెకు పార్టీ తరపున సహాయ నిరాకరణ మొదలైంది.
పార్టీ కోసం తాను ఇంతగా కష్టపడి పనిచేస్తుంటే తన గురించి పార్టీలో కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఇటీవలే ఆమె ఆరోపించారు. వారిపై చర్యలు తీసుకోవాలని కేసీఆర్‌ని కోరారు. కానీ కేసీఆర్ స్పందించలేదు!
కనుక ఆమె కోల్డ్ వార్ మొదలు పెట్టి ఉండవచ్చు. ఇప్పుడు బహిరంగంగా తండ్రి చుట్టూ దెయ్యాలు తిరుగుతున్నాయంటూ ఆమె చేసిన బిఆర్ఎస్ పార్టీలో ఆమె ఎపిసోడ్ క్లైమాక్స్ చేరుకున్నట్లే అనిపిస్తుంది.
అదే జరిగి ఆమె బయటకు వెళితే/పంపితే తర్వాత ఎపిసోడ్స్ మరింత రసవత్తరంగా సాగే అవకాశం ఉంటుంది.