
బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆ పార్టీ అధినేత, తన తండ్రి అయినా కేసీఆర్ ను ఉద్దేశించిన రాసిన లేఖ తెలంగాణ రాజకీయాలను ఆసక్తిగా మారిస్తే అటు బిఆర్ఎస్ పార్టీ లో మాత్రం ఊహించని తుఫాన్ ను తీసుకొచ్చినట్టయ్యింది.
కవిత ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టయ్యి దాదాపు ఆరు నెలలు జైలు జీవితం గడిపారు. అయితే ఆ సందర్భంగా కవిత, కేసీఆర్ మీద బీజేపీ చేపట్టిన కక్ష్య సాధింపు రాజకీయాలలో భాగంగానే ఈ నా అరెస్టు, అతి తొందరలో కడిగిన ముత్యంలా జైలు నుండి బయటకొస్తాను అంటూ వ్యాఖ్యానించారు.
Also Read – వైసీపీ ‘రక్త దాహం’ తీరలేదా.?
అదే సందర్భంలో అటు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, కవిత సోదరుడు కేటీఆర్, హరీష్ రావు కూడా కవిత వ్యాఖ్యలను బలపరుస్తూ, అన్యాయంగా ఈ కేసులో కవితను ఇరికించారు, త్వరలోనే కవిత ‘కడిగిన ముత్యం’లా ఈ కేసు నుండి బయటపడుతుంది అంటూ కవిత వ్యాఖ్యలకు మద్దతిచ్చారు.
అయితే బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఉద్దేశిస్తూ కవిత రాసిన లేఖ, కవిత విదేశాల నుంచి సొంత రాష్ట్రానికి వచ్చినప్పుడు జాగృతి సంస్థ కార్యకర్తలతో ‘సీఎం సీఎం’ అంటూ నినాదాలు చేస్తూ చేసిన హడావుడి కానీ, ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యిన మాట వాస్తవం.
Also Read – కేసులతోనే అంబటి భయం పోగొట్టారుగా!
దీనితో అటు ప్రత్యర్థి పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ లు కవిత చెప్పిన బిఆర్ఎస్ పార్టీలోని దెయ్యాల మీద వారి వారి అభిప్రాయాలను వ్యక్తపరుస్తూ కేసీఆర్ ను, కేటీఆర్ ను టార్గెట్ చేస్తున్నారు. బిఆర్ఎస్ లో కుటుంబ రాజకీయాలు భగ్గుమన్నాయి అంటూ బీజేపీ, కవిత చెప్పిన ఆ దెయ్యం మరెవరో కాదు తన అన్న కేటీఆరే అంటూ కాంగ్రెస్ ఇలా రెండు పార్టీలు బిఆర్ఎస్ పై విమర్శనా బాణాలు ఎక్కుపెడుతున్నాయి.
అయితే బిఆర్ఎస్ పార్టీ మాత్రం కనీసం ప్రత్యర్థుల విమర్శలకు కౌంటర్ కూడా ఇవ్వలేని పరిస్థితులను ఎదుర్కొంటుంది. అలాగే ఇటు మీడియా ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పలేక మాట దాటేసే ప్రయత్నం చేస్తున్నారు.
Also Read – అది ప్రమాదమట.. కేసు నమోదు చేయడం కుట్రట!
దీనితో బిఆర్ఎస్ లో ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే అప్పుడు ఆ కడిగిన ముత్యమే ఇప్పుడు గులాబీ ముల్లుగా మారి పార్టీని, పార్టీలోని అగ్ర నేతలను గుచ్చుతుందా అనేలా పరిస్థితులు మారిపోయాయి.
మరి ఆ ముళ్ళు ను దాటి గులాబీ తిరిగి తెలంగాణలో వికసించాలి అంటే కేసీఆర్ రాజకీయ వ్యూహాలకు సిద్దమవుతారా.? లేక కుటుంబ రాయబారాలు చేసి ఈ లేఖ పంచాయితీని ‘సీజ్ ఫెయిర్’ ఒప్పందంతో ముగిస్తారా.? అనేది వేచి చూడాలి.