
కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈటల రాజేందర్ ఆయన ప్రభుత్వంలో రెండుసార్లు మంత్రిగా చేశారు. ఆ తర్వాత ఆయనని కేసీఆర్ మెడ పట్టుకొని బయటకు గెంటేసి కేసులు నమోదు చేశారు. అప్పుడు ఈటల రాజేందర్ ‘బీజేపి కవచం’ తొడుక్కొని ఉపశమనం పొందారు. ఇప్పుడు బీజేపి ఎంపీగా ఉన్నారు.
కేసీఆర్ హయంలో ఆయన ఆర్ధిక మంత్రిగా చేసినందున, కాళేశ్వరం కేసులో కేసీఆర్, హరీష్ రావులతో పాటు ఆయనకి కూడా జూన్ 12న విచారణకు హాజరు కావాలని జస్టిస్ పీసీ ఘోష్ కమీషన్ నోటీస్ పంపింది.
Also Read – ఇలా అయితే ఎలా కవితక్కా?
ఇంతకాలం కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ & కో అవినీతికి పాల్పడ్డారని బీజేపి కూడా ఆరోపిస్తుండేది. ఆ కేసుని సీబీఐకి అప్పగించాలని బీజేపి నేతలు డిమాండ్ చేస్తుండేవారు.
ఇప్పుడు అదే కేసులో సొంత పార్టీ ఎంపీకి నోటీస్ రావడంతో ఇది తెలంగాణ బీజేపికి ఇబ్బందికరంగా మారిందిప్పుడు.
Also Read – సంక్షేమ పధకాలకు ఇంత తొందర ఎందుకు?
కానీ బీజేపికి ఇదో గొప్ప అవకాశం కూడా. ఈటల రాజేందర్ ఆర్ధికమంత్రిగా చేశారు కనుక కమీషన్ ఎదుట విచారణకు హాజరయ్యి, కేసీఆర్ బండారం బయటపెడితే, కేసీఆర్‌పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మార్గం సుగమం అవుతుంది. ఇది బిఆర్ఎస్ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ అవుతుంది.
రెండు వేర్వేరు కేసులలో కేసీఆర్, కేటీఆర్‌లని అరెస్టు చేయకుండా కేంద్రం అడ్డుపడుతోందని సిఎం రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.
Also Read – అమరావతి టూ పొదిలి అంతా వ్యూహాత్మకమే?
కనుక ఈటల రాజేందర్‌ని కాపాడుకోవడం కోసమైనా కేంద్రం కేసీఆర్ అరెస్టుకి గ్రీన్ సిగ్నల్ ఈయవచ్చు లేదా ఈ కేసుని సీబీఐ చేతికి అప్పగించాలని కోరవచ్చు. వీటిలో ఏది జరిగినా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మంచిదే.
ఒకవేళ కేంద్రం కేసీఆర్‌ని కాపాడాలనుకుంటే, తమిళనాడులో అన్నా డీఎంకే పార్టీ నుంచి, రాజకీయాల నుంచి శశికళని తప్పించినట్లుగానే, కేసీఆర్‌ని కూడా తప్పుకోమని కోరవచ్చు. ఈ కేసుల నుంచి ఉపశమనం లాభిస్తుందంటే కేసీఆర్ కూడా అందుకు అంగీకరించవచ్చు. ఒకవేళ ఆయన తప్పుకుంటే, తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ బలహీనపడుతుంది. అప్పుడు కాంగ్రెస్-బీజేపిల మద్య వార్-2 మొదలవుతుంది. కనుక కాళేశ్వరం క్లైమాక్స్ ఎవరూ ఊహించని విదంగా ఉండే అవకాశం ఉంది.