
జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలనుకున్న ఓ పార్టీ అధినేత, ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి శాసనసభ సమావేశాలకు హాజరుకాకపోవడం చట్ట సభలు, ప్రజాస్వామ్య వ్యవస్థ, ముఖ్యంగా తనని ఎమ్మెల్యేగా ఎన్నుకున్న నియోజకవర్గం ప్రజల పట్ల గౌరవం, బాధ్యత లేనట్లుగానే భావించాల్సి ఉంటుంది.
Also Read – పోసాని కేసు: అత్యుత్సాహం వద్దు రాజా!
ఇక్కడ జగన్, అక్కడ కేసీఆర్ ఇద్దరి తీరు ఒక్కలాగే ఉంది. ముఖ్యమంత్రిగా పదవి అధికారం చేతిలో ఉంటేనే శాసనసభకు వస్తాం లేకుంటే లేదనే ఇటువంటి నాయకులకు, ఎన్నికలలో ప్రజలే తగిన బుద్ధి చెపితేనే మళ్ళీ ఎవరూ ఈవిదంగా వ్యవహరించరు.
కేసీఆర్ శాసనసభ సమావేశాలకు రాకపోవడంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమన్నారంటే, “నెలనెలా ప్రభుత్వం నుంచి జీతభత్యాలు తీసుకొంటూ పనిచేయని ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే ఒక్క కేసీఆర్ మాత్రమే,” అని అన్నారు.
Also Read – కేసీఆర్, జగన్: దొందూ దొందే…
ఉద్యోగులు సెలవులు పెడితే వారి జీతాలలో కోత విధిస్తారు. మరీ ఎక్కువైతే ఉద్యోగంలో నుంచి సస్పెండ్ కూడా చేస్తారు. కానీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలకు ఎందుకు ఈ మినహాయింపు?
కేసీఆర్ దాదాపు ఏడాదిపైగా శాసనసభ సమావేశాలకు వెళ్ళకుండా ఫామ్‌హౌస్‌లో కూర్చొని రేవంత్ రెడ్డికి, మంత్రులకు పనిచేయడం చాతకాదు. అనుభవం లేదు. జ్ఞానం లేదు. కనీసం కామన్ సెన్స్ లేదంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.
Also Read – కొడాలి నాని అధ్యాయం ప్రారంభం!
కనుక దమ్ముంటే శాసనసభకు వచ్చి తమని ఎదుర్కోవాలని సిఎం రేవంత్ రెడ్డి, మంత్రులు సవాలు చేస్తున్నారు. కానీ ఇంతకాలం రాలేదు. ఇవాళ్ళ వచ్చారు.
ఆయన శాసనసభ సమావేశానికి వచ్చినప్పుడు బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎదురేగి ఆయనకు పూల బొకేలతో ఘనంగా స్వాగతం చెప్పి సాధారంగా లోనికి తోడ్కొని తీసుకువెళ్ళారు.
ఇది చాలా సహజమే అనిపించవచ్చు. కానీ తాను శాసనసభకు రావడమే ఓ అపూర్వ ఘట్టమన్నట్లు సీన్ క్రియేట్ చేశారనిపిస్తుంది కూడా!
రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి అయ్యుండి ఏడాదిగా శాసనసభకు మొహం చాటేసినందుకు కేసీఆర్ సిగ్గుతో తలదించుకోవాలి. ఇంతకాలం రానందుకు స్పీకర్‌కు సంజాయిషీ ఇచ్చుకోవాలి. అహం పక్కన పెట్టి సభ్యులకు క్షమాపణ చెప్పాలి.
కానీ కేసీఆర్ చాలా నేర్పుగా ఇలా ఘనంగా స్వాగతం పలికించుకొని, “ఇంతకాలం శాసనసభకు ఎందుకు రాలేదని” అడగాలనుకున్నవారు కూడా ‘కేసీఆర్ శాసనసభకు వచ్చారు’ అని చెప్పుకునేలా చేశారు.
ఏది ఏమైతేనేమి కేసీఆర్ శాసనసభకు వచ్చారు. కానీ బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు ప్రతీరోజూ రాకపోవచ్చునని తెలుస్తోంది. అదే నిజమనుకుంటే, అనర్హత వేటు పడకుండా హాజరు వేయించుకునేందుకే వచ్చారని భావించాల్సి ఉంటుంది.