ఇది తెరాస కథా.? లేక బిఆర్ఎస్ గాథా.?

KCR addressing media on BRS politics

సుమారు రెండేళ్ల సుదీర్ఘ అజ్ఞాతం తరువాత ఎట్టకేలకు మీడియా ముందుకొచ్చారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. అయితే కేసీఆర్ గోడకు తగిలించి తుపాకీ లాంటి వారని, అది ఎప్పుడు ఎలా అయినా పేలవచ్చు అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు తగ్గట్టే కేసీఆర్ అటు తెలంగాణ ప్రభుత్వం తో పాటు ఇటు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మీద కూడా పేలారు.

అయితే కేసీఆర్ తెలంగాణ లో రాజకీయం చెయ్యాలంటే ఏపీ ముఖ్యమంత్రి బాబుని టార్గెట్ చెయ్యాలా.? బిఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రావాలంటే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మళ్ళీ ప్రాంతీయవాద చిచ్చు రేపాలా.? అనేవిధంగా నీళ్లు, నిధులు అంటూ పాత తెరాస పాటనే కేసీఆర్ మళ్ళీ ఆలపిస్తున్నారా.?

ADVERTISEMENT

ఇంతకీ కేసీఆర్ ఈ సుదీర్ఘ ప్రసంగం వెనుక ఉన్నది తెరాస కథా.? లేక బిఆర్ఎస్ గాథా.? అనేది తెలియాల్సి ఉంది. పార్టీ పేరు మార్పుతో తెలంగాణలో కేసీఆర్ గులాబీ కారు కి వరుస ఓటములు ఎదురవ్వడంతో పాటుగా పార్టీలో కొడుకు – కూతురు మధ్య ఆధిపత్య పోరు ఊపందుకుంది.

ఇక మరోపక్క కేటీఆర్ రాజకీయ భవిష్యత్ కి పక్కలో బల్లెంలా, బిఆర్ఎస్ కి కట్టప్ప మాదిరి హరీష్ కాచుకుని కూర్చుకున్నారంటూ ప్రత్యర్థి పార్టీల నాయకుల తో పాటుగా కవిత కూడా ఆరోపిస్తున్నారు. ఇలా గత రెండేళ్లుగా నిప్పుల మీద కొలిమి మాదిరి బిఆర్ఎస్ ఉడుకుతుంది.

ఇటువంటి పరిస్థితులలో బయటకొచ్చిన కేసీఆర్ తన పార్టీ పేరును బిఆర్ఎస్ నుంచి తిరిగి తెరాస గా మార్చనున్నారా అనేలా పదేపదే తెరాస పేరును తన ప్రసంగంలో ఉచ్చరించారు. అలాగే నాటి తెరాస నుంచి నేటి బిఆర్ఎస్ వరకు కేసీఆర్ రాజకీయ శత్రువుగా భావిస్తున్న బాబు పై కూడా తన పాత రాగం అందుకున్నారు.

2014 లో ఏపీ సీఎం గా ఉన్న బాబు హయాంలో కూడా విశాఖలో పెట్టుబడిదారుల సదస్సు పేరుతో లక్షల కోట్ల ఎంవోయూ లు వచ్చాయంటూ హైప్ క్రియాట్ చేసారు. వాస్తవంగా ఆ ఎంవోయూ లు పెట్టుబడులుగా మారుంటే ఇప్పటికి ఏపీలో 20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చిండేవి కాదా.?

అంటూనే స్టార్ హోటల్స్ లో వంట మనుషులుగా పనిచేసే వారు ఆ ఎంవోయూ ల మీద సంతకాలు పెట్టారంటూ నాటి బాబు ప్రభుత్వాన్ని, బాబు ని కించపరరిచేలా, అవమానించేలా వ్యాఖ్యానించారు కేసీఆర్. అయితే పాలమూరు ఎత్తిపోతల పథకం దగ్గర మొదలైన కేసీఆర్ ప్రసంగం 2014 రాష్ట్ర విభజన తరువాత ఏపీలో జరిగిన ఎంవోయూల వరకు సాగింది.

అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెరాస తో మొదలైన ప్రాంతీయవాద రాజకీయాలకు తిరిగి కేసీఆర్ బిఆర్ఎస్ తో ఆజ్యం పొసే యోచనలో ఉన్నారు. తెలంగాణలో బిఆర్ఎస్ తిరిగి అధికారంలో రావాలంటే కేసీఆర్ దగ్గరున్న ఏకైక అస్త్రం ప్రాంతీయవాదమేనా.?

రాష్ట్ర విభజన జరిగి ఇన్నేళ్లు పూర్తయినా, తెలంగాణ మొదటి పదేళ్లు బిఆర్ఎస్ అధికారంలో ఉన్నా ఇప్పటికి ఆంధ్రా వల్ల తెలంగాణ నష్ట పోతుంది, ఆంధ్రా నాయకుల విధానాలే తెలంగాణ కు శాపాలుగా మారాయి అంటూ కేసీఆర్ ప్రసంగిచండం చూస్తుంటే జాతీయ పార్టీగా పేరు మార్చుకున్న బిఆర్ఎస్ ఇప్పటికి ప్రాంతీయవాద రాజకీయాలనే నమ్ముకుంది అనేది సుస్పష్టమయ్యింది.

ADVERTISEMENT
Latest Stories