తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులిద్దరికి ముందస్తు ఎన్నికల గురించి ఏదో సమాచారం వచ్చినట్టుగా కనిపిస్తుంది. నిన్న రాయలసీమ నేతలతో మాట్లాడుతూ నవంబర్ తరువాత ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉండాలని చంద్రబాబు అన్నారు. అలాగే మంత్రులతో ఏడాది చివరన ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని కేసీఆర్ అన్నట్టు సమాచారం.
దీనిని దృష్టిలో పెట్టుకుని ఇద్దరు చంద్రులు మరికొన్ని ప్రజాకర్షక కార్యక్రమాలు చేపట్టడానికి సిద్ధం అవుతున్నారని సమాచారం. రాజస్థాన్, మధ్య ప్రదేశ్ తో పాటు పార్లమెంట్ ఎన్నికలు, మరి కొన్ని రాష్ట్రాల ఎన్నికలు కలిపి ఒకేసారి నిర్వహించాలని మోడీ ప్రభుత్వం తలపెడుతుందట. దీనికి ఇద్దరు చంద్రులు ఒప్పుకున్నట్టు సమాచారం.
ఎన్నికలు ముందుగా జరిపితే ప్రతిపక్షాలకు తయారు కావడానికి తక్కువ సమయం ఉండి, అధికారపక్షాలకు కొంత మేలు చేస్తుందని వారిద్దరూ అభిప్రాయపడుతున్నారట. చంద్రబాబుకు విపక్షాల పోరు ఒకింత ఎక్కువగానే ఉందని చెప్పుకోవాలి. చూడాలి ఈ పాచిక ఎంత వరకు పారనుందో!



