తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సెక్షన్ 8 ని ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దుర్వినియోగం చేస్తున్నారని భావించి, దీనిపై ఆయన గవర్నర్ కు ఫిర్యాదు చేయాలని భావిస్తున్నారట. అన్ని ఆఫీస్ లను ఖాళీ చేసి అమరావతికి వెళ్లిపోయాక, ఇప్పుడు మళ్లీ పోలీస్ నిఘా విభాగాన్ని హైదరాబాద్ లో దింపి చంద్రబాబు తెలంగాణలో సర్వేలు చేయిస్తున్నారని కెసిఆర్ ఆగ్రహంగా ఉన్నారు.
[m9ad]
అంతేకాక టిఆర్ఎస్ నుంచి కొందరిని ఆకర్షించడానికి కూడా చంద్రబాబు ఈ నిఘా సిబ్బందిని వాడుకుంటున్నారని, జిల్లాల నుంచి టిఆర్ఎస్ నేతలు ముఖ్యమంత్రికి తెలిపారు. దాంతో ఈ అంశంపై చంద్రబాబు టిడిపి కోసం, ఇతర పార్టీల కోసం తెలంగాణలో నిఘా సిబ్బందిని వాడుతున్న తీరుపై గవర్నర్ కు పిర్యాదు చేయాలని కెసిఆర్ తలపెట్టారట.
అయితే పదిహేను సర్వేలు చేస్తే టీడీపీకి కనీసం 1% ఓటు బ్యాంకు కూడా లేన్నట్టు తేలిందని గతంలో కేసీఆర్ మీడియా ముఖంగా తెలిపారు. అయితే ఉన్నఫళంగా చంద్రబాబు ఏదో చేస్తారని కలవరం ఏమిటో అని తెలుగు దేశం నేతలు ఎద్దేవా చేస్తున్నారు. చంద్రబాబుకు కేసీఆర్ భయపడుతున్నారా? బయటకు మేకపోతు గంభీర్యం చూపిస్తున్నారా అని వాళ్ళు అడుగుతున్నారు.



