
తెలంగాణ రాజకీయాలలో రెండు కేసులు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. బిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ ఆ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సుప్రీంకోర్టులో కేసు వేశారు.
Also Read – కోటరీ రియాక్షన్ లేదేమిటి?
విజయపాల్ రెడ్డి అనే వ్యక్తి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ శాసనసభ సమావేశాలకు హాజరుకావడం లేదు కనుక ఆయనపై అనర్హత వేటువేయాలని కోరుతూ రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ వేశారు.
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బిఆర్ఎస్ పార్టీ కోరుకుంటుంటే, ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌పై అనర్హత వేటు వేయాలని కోరుతూ పిటిషన్ దాఖలవడం ఆసక్తికరంగానే ఉంది కదా?
Also Read – ఊరిస్తూనే…ఉసురుమనిపిస్తుందే..!
ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో ఈ నెల 22లోగా కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ శాసనసభ కార్యదర్శికి, తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది.
ఆ 10 మంది ఎమ్మెల్యేల విషయంలో ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకున్నారో, చర్యలు తీసుకోవడంలో ఎందుకు ఇంత ఆలస్యమైందో వివరణ ఇవ్వాలని సుప్రీంకోర్టు వారిని ఆదేశించింది.
Also Read – వైసీపీ ‘గొంతు’నొక్కేస్తే…కూటమి ‘కళ్ళు’ మూసుకుందా.?
శాసనసభ సమావేశాలకు రాకుండా బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్న కేసీఆర్‌పై అనర్హత వేటు వేయాల్సిన అవసరం ఉందని విజయపాల్ రెడ్డి తరపు న్యాయవాది వాదించగా, ఈ పిటిషన్ విచారణకు తగిన అర్హమైనది కాదని శాసనసభ కార్యదర్శి తరపు న్యాయవాది వాదించడం మరో విశేషం. అంటే కేసీఆర్‌పై అనర్హత వేటు వేసే ఉద్దేశ్యం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి లేదనుకోవాలేమో?ఒకవేళ అటువంటి ఆలోచన ఉంటే స్పీకర్ అనుమతి లేకుండా 60 రోజులకు పైగా శాసనసభ సమావేశాలకు రాని కేసీఆర్‌పై ఎప్పుడో అనర్హత వేసి ఉండాలి కదా? పిటిషనర్ తరపు న్యాయవాది అభ్యర్ధన మేరకు ఈ కేసుని హైకోర్టు 2 వారాలు వాయిదా వేసింది.
ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించడం ఎంత తప్పు, అనైతికమో, అదేవిదంగా ఎమ్మెల్యేగా ఎన్నికైన వ్యక్తులు ఎటువంటి బలమైన కారణాలు లేకుండా, స్పీకర్ అనుమతి తీసుకోకుండా శాసనసభ సమావేశాలకు హాజరు కాకపోవడం కూడా తప్పే కదా?
అక్కడ కేసీఆర్, ఇక్కడ జగన్ ఇద్దరూ తాము మహా మేధావులమని భావిస్తుంటారు. కానీ శాసనసభ సమావేశాలకు హాజరవడం తమ బాధ్యత అని భావించడం లేదు. ఎందుకంటే ఇద్దరికీ ఇగో ప్రాబ్లెం ఉంది కనుక?