ప్రభుత్వాలను ప్రజలు మార్చగలరు… వైసీపికి తెలుసో లేదో?

KCR-Jagan

తెలంగాణతో సహా నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు మరోసారి ప్రజాస్వామ్యం బలం ఏమిటో నిరూపించి చూపాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ బీజేపీకి పట్టం కట్టగా, రాజస్థాన్, ఛత్తీస్‌ఘడ్‌ రాష్ట్రాలలో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని తిరస్కరించి బీజేపీకి పట్టం కట్టారు. అదే విదంగా తెలంగాణలో కేసీఆర్‌ని గద్దె దించి కాంగ్రెస్‌ పార్టీని గెలిపించారు. మిజోరాంలో అధికారంలో ఉన్న పార్టీని గద్దె దించి ప్రతిపక్షపార్టీకి అధికారం కట్టబెట్టారు.

ఇది అందరికీ తెలిసిన విషయమే కదా? ప్రతీ ఎన్నికలలో ఇలాగే జరుగుతుంటుంది కదా?అని అనుకోవచ్చు. కానీ అధికారంలో ఉన్నప్పుడు మాకు తిరుగులేదు. మేము చెప్పిందే శాసనం. మేము చేసిందే పాలన. మాకంటే గొప్పగా మరెవరూ పరిపాలించలేరు. ప్రజలందరూ మావైపే ఉన్నారు. కనుక మరో 30 ఏళ్ళు మేమే అధికారంలో ఉంటామని అహంకారంతో విర్రవీగే ప్రతీ పార్టీకి, ముఖ్యమంత్రికి, రాజకీయ నాయకుడిని సామాన్య ప్రజలు గద్దె దించి గడ్డి పెట్టగలమని ఈ ఎన్నికలలో మరోసారి నిరూపించి చూపారు.

ADVERTISEMENT

రాజకీయ పార్టీలు, ముఖ్యంగా అధికారంలో ఉన్నపార్టీలు అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ, ప్రతిపక్ష నేతలను వేదిస్తూ, వందల కోట్లు వెదజల్లుతూ ఎన్నికలలో అవలీలగా గెలవగలమని గట్టి నమ్మకంతో ఉంటాయి. తెలంగాణ ఎన్నికలలో కేసీఆర్‌, మంత్రులు, ప్రధాని నరేంద్రమోడీ, హోంమంత్రి అమిత్ షాలతో సహా పలువురు ప్రముఖులు ఎంతగా ప్రచారం చేశారో ఎటువంటి వాదనలు వినిపించారో… ఎటువంటి వ్యూహాలు అమలుచేశారో అందరూ చూశారు.

కానీ ఎవరెన్ని చేసినా, ఎంత చెప్పినా, భిన్నవాదనలు వినిపిస్తూ అయోమయపరిచినా, ఓటర్లను ఎంత ప్రలోభ పెట్టినా, ఎంత ఒత్తిడికి గురిచేసినా వారు సర్వశక్తివంతమైన అధికార పార్టీలను, ప్రతిపక్ష పార్టీలను కూడా ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచగలరని ఈ ఎన్నికలలో మరోసారి నిరూపించి చూపారు.

తెలంగాణ అభివృద్ధి, సంక్షేమ పధకాలను చూసి ప్రజలు మళ్ళీ మళ్ళీ తమనే ఎన్నుకొంటారనే కేసీఆర్‌, కేటీఆర్‌ తదితరుల గుడ్డినమ్మకాన్ని సామాన్య ప్రజలు పటాపంచలు చేశారు.

ఏపీలో వైసీపి పాలన పట్ల ప్రజలు తీవ్ర అసహనం, అసంతృప్తితో ఉన్నారనే విషయం గడప గడపకి, బస్సు యాత్రలలోనే బయటపడుతోంది. అయినప్పటికీ 175 సీట్లు మేమే గెలుచుకొంటామని వైసీపి నేతలు చెప్పుకొంటున్నారు. మరోపక్క ఎన్నికలలోగా టిడిపి, జనసేనలను రాజకీయంగా చావు దెబ్బ తీయడానికి, ఓటర్ల జాబితాలను తారుమారు చేసేందుకు వైసీపి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.

వీటితో ఎన్నికలలో గెలిచేయగలమని వైసీపి భావిస్తున్నట్లు అర్దమవుతోంది. అంటే కేసీఆర్‌ కంటే ఎక్కువ గుడ్డినమ్మకంతో కాలక్షేపం చేస్తున్నారన్న మాట! ఇలా వ్యవహరిస్తే ఏం జరుగుతుంది?అంటే కేసీఆర్‌ మన ఎదురుగానే ఉన్నారుగా?

ADVERTISEMENT
Latest Stories