ys-jagan-mohan-reddy-kcr

జగన్‌, కేసీఆర్‌ ఇద్దరికీ అహంభావం ఎక్కువ. అందుకే ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత శాసనసభ సమావేశాలకు వెళ్ళడం మానుకున్నారు. అన్నీ నాకు మాత్రమే తెలుసు. మా ఆలోచనలు, నిర్ణయాలు, వ్యూహాలు చాలా గొప్పవి. సామాన్యులకు చెప్పినా అర్ధం కావనుకుంటారు. అందుకే ఏకపక్ష నిర్ణయాలు తీసుకునేవారు.

కానీ బెడిసికొడితే మంత్రులు, ఎమ్మెల్యేల వల్లనే మాకు చెడ్డపేరు అని వితండవాదం చేస్తూ మార్చేసేవారు. ఇద్దరిలో రాచరిక పోకడలు బలంగా ఉన్నాయి.

Also Read – అమరావతికి మరోసారి శంకుస్థాపన?

అందుకే మరో 30 ఏళ్ళు మేమే ముఖ్యమంత్రులుగా ఉండాలి.. ఉంటాము. అంటే ఇద్దరూ ‘థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ’ అన్నమాట.

మా పాలనలోనే రాజ్యం సుభిక్షంగా ఉంటుంది. మారాజ్యంలో మరెవరికీ ప్రవేశం లేదు. మా రాజ్యంలో ఉండాలనుకున్న పార్టీలు మాకు నచ్చిన్నట్లే రాజకీయాలు చేసుకోవాలి. ఎవరూ మాకు ఎదురుచెప్పకూడదని ఇద్దరూ కోరుకుంటారు.

Also Read – కోటరీ రియాక్షన్ లేదేమిటి?

ప్రగతి భవన్‌, వైట్‌హౌస్‌ వంటి సచివాలయం కేసీఆర్‌ రాచరిక పోకడలకు నిలువెత్తు నిదర్శనాలు కాగా, ఋషికొండ ప్యాలస్‌ జగన్‌ రాచరిక పోకడలకు నిదర్శనం.

ఇద్దరూ తమతమ పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజల వద్దకు వెళ్ళకుండా వారినే తమ ఫామ్‌హౌస్‌, ప్యాలస్‌లకు రప్పించుకొని తమ దర్శనభాగ్యం కల్పించి, అభయహస్తం ఇచ్చి పంపిస్తుండటం కూడా రాచరిక పోకడలకు నిదర్శనాలే… కదా?

Also Read – పడి లేచిన కెరటం .. జనసేన ..

కనుక ఆ ప్రకారమే నేడు ఉమ్మడి గుంటూరు జిల్లా స్ధానిక ప్రజా ప్రతినిధులను తాడేపల్లి ప్యాలస్‌కి పిలిపించుకున్నారు.

రాజాసాబ్ ఆంతరంగిక మందిరం నుంచి ప్యాలస్‌లోని సమావేశ మందిరానికి చేరుకునేందుకు కొంత సమయం పడుతుంది. కనుక అందరూ ఆయన కోసం ఎదురుచూస్తుంటే, ఆలోగా ఆ వీడియోకి ‘నువ్వే జగన్‌.. కావాలి జగన్‌..“ అంటూ ఓ పాత మాస్ బీట్ పాటని తగిలించి సోషల్ మీడియాలో కూడా పెట్టారు.

ఇదివరకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడు ఎక్కడ బటన్ నొక్కినా జగన్‌ అవే పదాలు కాస్త మార్చి ఒకటే పాట పాడుతుండేవారు.

ఇప్పుడు అధికారం కోల్పోయిన బాధ, ఆక్రోశం కూడా తోడయింది. కనుక ఆ పీలింగ్స్ కూడా కలిపి ‘మళ్ళీ నేను ముఖ్యమంత్రి అయితే తప్ప ఈ రాష్ట్రం బాగుపడదు. ఈసారి ఎలాగూ నేనే మళ్ళీ అవుతాను. ఈసారి కుర్చీలో కూర్చుంటే మరో 30 ఏళ్ళపాటు అన్నీ దానిలోనే.. దిగే ప్రసక్తే లేదు,” అని చెపుతుంటారు.

“నా కోసం మీరందరూ పోరాడుతూ ఉండండి. కేసులు పెట్టించుకోండి. అవసరమైతే జైళ్ళకు వెళ్ళండి. నేను ముఖ్యమంత్రికాగానే మీ కష్టాలన్నీ తీరచేస్తానని,” అభయ హస్తం ఇచ్చి పంపించేస్తుంటారు.

కానీ జగన్‌ ఈ రాజదర్బార్, రాచరిక పోకడలు పక్కన పెట్టి పార్టీ కార్యకర్తలు, ప్రజల మద్యకు వెళ్ళాలి. మళ్ళీ అందరికీ ముద్దులు, ఆశీర్వాదాలు విరివిగా పంచి పెట్టాలి. సింగిల్ సింహం అవసరమైతే ధైర్యంగా శాసనసభ సమావేశాలకు కూడా వెళ్ళి ధైర్యం నిరూపించుకోవాలి.

కాదని ప్యాలస్‌లోనే కాలక్షేపం చేస్తుంటే ప్రజలే కాదు.. పార్టీ నేతలు, కార్యకర్తలు కూడా జగన్‌ని మరిచిపోయే ప్రమాదం ఉంటుంది.