
కేసీఆర్, బిఆర్ఎస్ పార్టీ నేతలు కాళేశ్వరం ప్రాజెక్టు వంటి గొప్ప అద్భుతమైన ప్రాజెక్ట్ ఈ ప్రపంచంలోనే లేదన్నట్లు, కేసీఆర్ కుర్చీ వేసుకొని కూర్చొని దగ్గరుండి కట్టించిన మహా మేధావని గొప్పలు చెప్పుకునేవారు. దాంతో కోటి ఎకరాలకు నీళ్ళు అందించిన ‘అపర భగీరధుడు’ కేసీఆర్ అని ప్రచారం చేసుకున్నారు. పాలభిషేకాలు కూడా చేయించుకున్నారు.
కానీ ఆయన దురదృష్టం కూడా అది కట్టిన మూడేళ్ళకే. అంటే 2023 డిసెంబర్‌లో ఎన్నికలకు నాలుగైదు నెలల ముందే మేడిగడ్డ బ్యారేజీలో మూడు పిల్లర్లు క్రుంగిపోయాయి. దాని తర్వాత ఉన్న అన్నారం, సుందిళ్ళ బ్యారేజీలు గోడలు బీటలువారి నీళ్ళు లీక్ అయిపోతున్నాయి.
ఇవన్నీ వరుసగా జరగడంతో, కేసీఆర్ దేనిని చూపించి గొప్పగా చెప్పుకున్నారో సరిగ్గా దాంతోనే రేవంత్ రెడ్డి ఆయనని ప్రజల ముందు దోషిగా నిలబెట్టారు. కనుక బిఆర్ఎస్ పార్టీ ఓటమికి కాళేశ్వరం ప్రాజెక్టు కూడా ఒక కారణమే అని భావించవచ్చు.
అయితే ఈ కధ ముగిసిపోలేదు. ఏనాటికైనా కేసీఆర్‌ని చంచల్‌గూడా జైల్లో చిప్పకూడు తినిపిస్తానని శపధం చేసిన రేవంత్ రెడ్డి, కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి, అక్రమాలపై విచారణ జరిపించి, పక్కా సాక్ష్యాధారాలతో కేసీఆర్‌ని జైలుకి పంపేందుకు జస్టిస్ పినాకి చంద్ర బోస్ కమీషన్ చేత విచారణ జరిపిస్తున్నారు.
Also Read – గెట్ రెడీ..స్టే ట్యూన్డ్ టూ ‘తాడేపల్లి ఫైల్స్’..!
ఈ ప్రాజెక్టుతో సంబంధం ఉన్న ప్రతీ అధికారిని ఆయన పిలిచి ప్రశ్నించి నివేదిక సిద్దం చేస్తున్నారు. ఇప్పటికే 256 పేజీలతో నివేదిక సిద్దమైంది. త్వరలో కేసీఆర్, మాజీ ఆర్ధిక, సాగునీటిశాఖ మంత్రి హరీష్ రావులను కూడా పిలిచి ప్రశ్నిస్తే నివేదిక రెడీ అయిపోతుంది. అది సిఎం రేవంత్ రెడ్డి చేతికి వస్తుంది.
ఈ ప్రాజెక్టులో కేసీఆర్ భారీగా అవినీతికి పాల్పడ్డారని కమీషన్ నివేదిక ఇచ్చినంత మాత్రన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆయనని అరెస్ట్ చేయగలదా?అంటే కాదనే చెప్పొచ్చు.
Also Read – జగన్ మొదలెట్టేశారు.. విజయసాయి రెడీయా?
ఎఫ్-1 రేసింగ్ కేసులో విచారణ జరిపి కేటీఆర్‌పై కేసు నమోదు చేసి విచారణ జరిపినప్పటికీ ఇంతవరకు అరెస్ట్ చేయలేదు కదా?
రేవంత్ రెడ్డి సైగ చేస్తే చాలు పోలీసులు కేటీఆర్‌ని అరెస్ట్ చేసి జైలుకి పంపించగలరు. కానీ ఆ పేరుతో బిఆర్ఎస్ పార్టీ చేసే హడావుడితో ఆ పార్టీకి రాజకీయ మైలేజ్ లభిస్తుంది. త్వరలో జీహెచ్ఎంసీ, స్థానిక సంస్థల ఎన్నికలు జరుగబోతున్నాయి. కనుక ఇటువంటి సమయంలో కేటీఆర్, కేసీఆర్‌లని అరెస్ట్ చేసి బిఆర్ఎస్ పార్టీకి సానుభూతి ఓట్లు అందించాలని రేవంత్ రెడ్డి కోరుకోరు కదా?
ఇది కేటీఆర్‌కి కూడా బాగా తెలుసు గనుకనే “దమ్ముంటే నన్ను అరెస్ట్ చేసుకోమని’ సవాళ్ళు విసురుతున్నారు. అయినా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెనకడుగు వేస్తోంది. కేటీఆర్‌ని అరెస్ట్ చేయడానికే భయపడుతున్నప్పుడు కేసీఆర్‌ని అరెస్ట్ చేయగలదా?అంటే కాదనే అర్దమవుతోంది.
ఒకవేళ కాళేశ్వరం కేసులు మొదలైనా కేసీఆర్ కూడా జగన్ ఆక్రమస్థుల కేసుల్లాగే వాటితో హైకోర్టు-సుప్రీంకోర్టు మద్య షటిల్ ఆడించేస్తూ, అవకాశం లభిస్తే మళ్ళీ తెలంగాణ ముఖ్యమంత్రి అయిపోగలరు కూడా.
కనుక కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ పేరుతో కమీషన్ విచారణ జరిపి నివేదిక ఇచ్చినా దాని వలన కేసీఆర్‌కి వచ్చే నష్టం ఏమీ లేదనే భావించవచ్చు. కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి ఇంత కంటే విషాదం ఏముంటుంది?