తెలంగాణా నాట ప్రముఖ దినపత్రికగా, ఒక రకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మానసపుత్రికగా మారిన ‘నమస్తే తెలంగాణా’ దినపత్రిక ఎండీ దీవకొండ దామోదరరావు ఇంట వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు విచ్చేసి నూతోన వదూవరులకు తమ ఆశీర్వాదం అందించారు. ఈ వేడుకకు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి, తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీష్ రావు వంటి రాజకీయ ప్రముఖులు విచ్చేసారు.
అలాగే టాలీవుడ్ నుండి కింగ్ నాగార్జున, అఖిల్ లు హాజరు కాగా, ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ కూడా విచ్చేసారు. మరికొందరు స్థానిక నేతలు కిషన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకరరావు తదితరులు కూడా హాజరయ్యారు. కర్ణాటకలో గాలి ఇంట వివాహ మహోత్సవానికి హాజరు కానటువంటి జగన్ మోహన్ రెడ్డి, ఈ వేడుకకు విచ్చేయడం ప్రాధాన్యతను దక్కించుకుంది. అలాగే జగన్ అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న నిమ్మగడ్డ, అదే నిమ్మగడ్డను జైలులో పలకరించిన నాగార్జునల హాజరు చర్చనీయాంశమైంది.



